యువకుల పైన కత్తులతో దాడి, ఉద్యోగాల పేరుతో మోసం
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సర్ధాకోడులో ఇద్దరు యువకుల పైన దాడికి జరిగింది. ఆలయ భూముల సాగు విషయంలో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఇరువురుకి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
ఉద్యోగాల పేరిట మోసం
ప్రకాశం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సదరు నిందితుడిని ఖమ్మం జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దాదాపు వంద మంది నిరుద్యోగుల నుండి నిందితుడు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మార్కాపురంలోనే సుమారు ఇరవై మందికి పైగా మోసపోయారు.
వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఓ కారు అదుపు తప్పి గొర్రెల మంద పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో గొర్రెల కాపరి మృతి చెందాడు. అతనితో పాటు ఇరవై గొర్రెలు చనిపోయాయి.












Click it and Unblock the Notifications