పులివెందుల: వేధింపులపై ఫిర్యాదు చేస్తే యువతిని చితకబాదారు

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతూరైన పులివెందులలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే అక్కసుతో ఇద్దరు యువకులు ఓ యువతిని చితకబాదారు.

తీవ్రగాయాలపాలైన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుల నుంచి బాధిత యువతి కొంత కాలంగా వేధింపులకు గురవుతోంది.

 Two youths allegedly beats a girl

వేధింపుల తీవ్రమవడంతో సదరు యువకులపై గురువారం ఉదయం బాధిత యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు స్పందించలోగానే విషయం తెలుసుకున్న నిందితులు.. యువతిపై దాడి చేసి చావబాదారు. ఘటనతో మేల్కొన్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యువకుడిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

కర్నూలు జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు రాళ్లతో కొట్టి హతమర్చారు. జిల్లాలోని నందికొట్కూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+