ఆరేళ్ల బాలుడిని మద్యం తాగి మేనమామే చంపాడు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి యశ్ రాజ్‌కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరేళ్ల యశ్ రాజ్‌కుమార్ హత్య హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మేనమామ వినోద్ ఆ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇరవై వేల రూపాయల కోసం సొంత మేనమామ వినోద్ కిడ్నాప్ చేసి, యశ్ రాజ్‌కుమార్‌ను హత్య చేశాడని హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి సత్యనారాయణ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.

డిసిపి సత్యనారాయణ కథనం ప్రకారం - వినోద్‌కు అనూప్ సహకరించి ఉండవచ్చు. హత్యలో అనూప్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగ్‌లోని పిరంచెరువు సమీపంలో యశ్ రాజ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేశారు. వినోద్‌ను, అనూప్‌ను మంగళహాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలుడి గొంతుకు ఉరి బిగించి హత్య చేసి, ఆ తర్వాత బండరాయితో ముఖంపై మోదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మంగళహాట్ గోడెఖబర్‌కు చెందిన అనిల్ కుమారుడు యశ్‌రాజ్ కుమార్. మంగళవారం అదృశ్యం కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు.

వినోద్ బాలుడ్ని కిడ్నాప్ చేసి మద్యం మత్తులో హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ఆటోలు మారుస్తూ, బాలుడికి చిప్స్ ప్యాకెట్ ఇప్పించి, మధ్యలో మద్యం సేవించి వినోద్ పిరంచెరువు వద్దకు చేర్చాడు. యశ్ రాజ్ కుమార్ తల్లిదండ్రులకు ఎవరితోనూ విరోధం లేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications