ఉండవల్లిలో ఫ్లెక్సీల కలకలం-కరకట్ట విస్తరణకు పొలాలు ఇవ్వం- రావొద్దని సీఆర్డీయేకు వినతి
ఏపీలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉన్న కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. దీంతో పనులు మొదలుపెట్టేందుకు వెళ్లిన అధికారులకు స్దానిక రైతులు షాకిచ్చారు. తమకు పరిహారం చెల్లించకుండా తమ పొలాల్లోకి రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి కరకట్ట పై ఉండవల్లి,పెనుమాక రైతులు ఇవాళ నిరసన తెలిపారు. ఉండవల్లి కొండవీటివాగు ఎత్తిపోతల నుండి 15 కిలోమీటర్ల కృష్ణానది ఎగువ కుడికరకట్ట బలోపేతం, కట్టరోడ్డు విస్తీర్ణ పనులు సీఆర్డీఏ అధికారులు చేపట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా కరకట్ట విస్తరణ పనులు చేపడితే అడ్డుకుంటాం అని రైతులు హెచ్చరించారు.

సెంటుకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.30 మందికి చెందిన రైతులకు చెందిన భూమి సెంట్లో నష్టపో తున్నామంటు రైతులు అన్నారు.పంటపోలాల్లో సీఆర్డీఏకి విజ్ఞప్తి చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు నిరసన తెలిపారు.ఫ్లెక్సీల తో రైతులు తమ భూముల్లో ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు.2013 భూసేకరణ చట్టం అనుసరించి పరిహారం ఇవ్వావలంటూ రైతులు డిమాండ్ చేశారు.తమకు నష్టపరిహారం చెల్లించే వరుకు కొనసాగిస్తాం అంటూ హెచ్చరించారు.

గతంలో అమరావతి రాజధాని అభివృద్ధి చేయడం లేదనే విమర్శల మధ్య వైసీపీ సర్కార్ కరకట్ట విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. అయితే ఇక్కడ భూసేకరణ చేపట్టి పరిహారం పూర్తిగా చెల్లించకుండా పనులు మొదలుపెట్టడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు రైతుల్ని అక్కడికి రావొద్దని కోరుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. దీంతో సీఆర్డీయే అధికారులు దీనిపై ఏం చేయాలనే అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications