ఉండవల్లి శ్రీదేవి అమరావతి నినాదం స్క్రిప్ట్ చంద్రబాబుదే: ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యవహారంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు. ఉండవల్లి శ్రీదేవి అమరావతి అన్నప్పుడే ఆ స్క్రిప్ట్ చంద్రబాబుదే అని అర్థమైందని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి తనకు నచ్చినట్టుగా ఉండొచ్చని, కానీ తనకు ప్రాణహాని ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదని డొక్కా మనకి ప్రసాద్ తెలిపారు. వైఎస్ఆర్సిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా ఉండవల్లి శ్రీదేవి ఒక్కరే అమరావతి నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

మొదటి నుంచి ఉండవల్లి శ్రీదేవి రాజకీయాల్లో అన్ని వివాదాలేనని, ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆమె తన బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ సలహాదారు సభ్యుల రామకృష్ణారెడ్డి తో తనకు ప్రాణహాని ఉందని చెప్పడం సరైనది కాదని పేర్కొన్నారు. అంత పెద్ద మాటలు పెద్దవాళ్ల గురించి మాట్లాడటం దేనికంటూ ప్రశ్నించారు. ఆమెకు ఎవరితోనూ ఎటువంటి హానీ లేదని పేర్కొన్నారు.

Undavalli Sridevi Amaravati slogan Script by Chandrababu: MLC Dokka Manikya Varaprasad

ఆమెకు ఎవరితోనూ ఎటువంటి ప్రాణహాని లేదని పేర్కొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారని, ఎమ్మెల్యే శ్రీదేవి ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గౌరవంగా చూశారన్నారు. ఆమె ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా తిరగాలనుకున్న చోట తిరగొచ్చని, ఆమెకు ఏం రక్షణ కావాలో చెబితే ప్రభుత్వం కల్పిస్తుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. ఉండవల్లి శ్రీదేవి విషయంలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు అని, ఇకనైనా ఆమె ఇటువంటి వివాదాలకు స్వస్తి చెప్పి తన పని తాను చూసుకోవాలని హితవు పలికారు.

ఇక ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు కోట్లు వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ నాయకులు డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారని దానిని తాను తిరస్కరించాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడం, అది వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకోవడం బాబు ఓటుకు కోట్లు రాజకీయానికి నిదర్శనమని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.

గతంలో తెలంగాణలోనూ చంద్రబాబు ఇటువంటి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికారని గుర్తు చేశారు. 1995లో వైస్రాయ్ నుంచి నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు వరకు బాబుది ఇదే తీరంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సిబి సిఐడి, ఈడి లు జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని. కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+