జగన్! వయసు చూడు: ఉండవల్లి సలహా, బాబు లాంటి వాన్ని చూడలేదు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చారు.

మమ్మల్ని గెలిపించావు సరే: జగన్‌కు ఆది సూటి ప్రశ్న, ఇరుకునపెట్టే యత్నం

బాబు వయస్సు చూసి గౌరవం ఇవ్వాలి

బాబు వయస్సు చూసి గౌరవం ఇవ్వాలి

రాజకీయాల్లో సీనియర్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వయసును చూసి అయినా జగన్ గౌరవం ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు.

అలా చేస్తే స్థానం

అలా చేస్తే స్థానం

జగన్ గౌరవించడం నేర్చుకుంటే, ప్రజల మదిలో స్థానం సంపాదించుకోవచ్చని ఉండవల్లి హితవు పలికారు. చంద్రబాబు వైఖరి తప్పని, అయినప్పటికీ ఆయనతో పోలిస్తే చాలా తక్కువ వయసున్న జగన్ సంయమనం పాటిస్తేనే మంచిదన్నారు.

బాబు వంటి అబద్దాల కోరును చూడలేదు

బాబు వంటి అబద్దాల కోరును చూడలేదు

చంద్రబాబు వంటి పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రిని తాను ఇంతవరకూ చూడలేదని ఉండవల్లి అన్నారు. డిసెంబర్ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్తపట్నం ప్రాజెక్టును హడావుడిగా పనులు పూర్తికాకుండానే ఆగస్టు 15న జాతికి అంకితం చేశారని మండిపడ్డారు.

బాబుది అవినీతి ప్రభుత్వం

బాబుది అవినీతి ప్రభుత్వం

పోలవరం పనులు ఏడాదికి మూడు శాతం మాత్రమే జరుగుతున్నాయని ఉండవల్లి విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఇంకో అయిదేళ్లయినా పూర్తి కాబోదన్నారు. ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress former MP Undavalli Arun Kumar on monday suggested ysr congress party chief YS Jaganmohan Reddy over AP CM Nara Chandrababu Naidu issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి