అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ అసెంబ్లీ, మండలి, సచివాలయంలో పతాకావిష్కరణలు-పాల్గొన్న స్పీకర్, ఛైర్మన్, సీఎస్

|
Google Oneindia TeluguNews

ఏపీలో 76వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన మండలి,శాసన సభ ప్రాంగణాల్లో ఘనంగాస్వాతంత్ర్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి భవనంపై చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభ భవనంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ జెండాలు ఎగురవేశారు.
76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్ర శాసన మండలిరాష్ట్ర శాసన సభా ప్రాంగణాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర శాసన మండలి భవనంపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభ భవనంపై శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ వరుసగా జాతీయ జెండాలను ఎగురవేసి వందన సమర్పణ చేశారు.

వేరు వేరుగా జరిగిన ఈ జెండా వందన కార్యక్రమంలో తొలుత వారిరువురూ వేరు వేరుగా ఎస్పిఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. రాష్ట్ర ప్రజలు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

unfurling of national flags at ap legislative assembly, council and ap secretariat

శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలం పాటు నిర్వహిస్తున్న "ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను" రాష్ట్రంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుండి నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా "హర్ ఘర్ తిరంగా" (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయి వజ్రోత్సవ వేడుకలను జరుకుంటున్న నేపథ్యంలో గత 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఒక సారి సింహావలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అదే విధంగా ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్య్ర దినోత్సవం సందర్బంగా ఆ మహానుభావుల త్యాగాలను ఒక సారి స్పురణకు తెచ్చుకుంటూ, వారి లక్ష్యాలు, ఆశయ సాధన దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనందరం అలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

Recommended Video

Title : Chandrababu Naidu About పింగళి వెంకయ్య, పివి నరసింహారావు *AndhraPradesh
unfurling of national flags at ap legislative assembly, council and ap secretariat

మరోవైపు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంజాతీయ జెండా ఆవిష్కరించారు. అటు సచివాలయంలో సిఎస్ డా.సమీర్ శర్మ జాతీయ జెండాను ఎగురవేశారు. అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనతంరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు.

English summary
76th independence day celebrated in ap assembly, legislative council and secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X