వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు రూ.1200 కోట్లు అడిగితే, జైట్లీ ఇచ్చింది రూ.100 కోట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్రం ప్రవేశ పెట్టిన సోమవారం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా పైన మాట లేదు. అయితే, విజయవాడ మెట్రో రైలుకు, పోలవరం ప్రాజెక్టు, విద్యా సంస్థలకు మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిధులు కేటాయించారు.

పోలవరం ప్రాజెక్టు కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. విజయవాడ మెట్రో కోసం రూ.100 కోట్లు ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.4వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపించగా.. కేంద్రం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది.

ఏపీలోని ట్రిపుల్‌ ఐటీలకు రూ.20కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ.40కోట్లు, విశాఖపట్నం ఐఐఎంకు రూ.30కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీకి రూ.40కోట్లు, తిరుపతి ఐఐఎస్సీఆర్‌కు రూ.40 కోట్లు, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.కోటి కేటాయించారు.

Union Budget 2016 17: Rs 100 crore to Polavaram Project

ఇదిలా ఉండగా, ప్రధానమైన ప్రత్యేక హోదా విషయంలో గానీ, అమరావతికి నిధులుగానీ కేటాయించలేదు. సాగర నగరం, ఏపీ ఎకనమికల్ కేపిటల్‌గా సరికొత్త రూపు సంతరించుకుంటున్న విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలుకు కేవలం రూ.1 లక్ష కేటాయించారు.

రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఒకేసారి పచ్చజెండా ఊపిన కేంద్రం, కేటాయింపుల్లో మాత్రం భారీ వ్యత్యాసాన్ని చూపింది. కాగా, బడ్జెట్ పైన బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇది దేశ ప్రగతి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు.

అవిశ్వాసానికి నిర్ణయం

భేటీలో జగన్ మాట్లాడుతూ.. ఉన్నవాళ్లే మనవాళ్లు అన్నారు. ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానంకు జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సభాపతి మీద అవిశ్వాసం పైన త్వరలో నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, ఈ సమావేశానికి 54 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

English summary
Finance Minister Arun Jaitley presents his third Union Budget. With an eye on supporting the small tax-payer and the small investor, the Minister announced a slew of schemes, and income tax exemptions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X