500జలాశయాలు, అమృత్ సరోవర్లు..వ్యవసాయ అనుబంధ రైతులకు బడ్జెట్ లో ప్రోత్సాహకాలు!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్లో అనేక శుభవార్తలు చెప్పింది. గ్రామీణ ప్రాంతాలలోని రైతులు, కార్మికుల ఆదాయం పెంచడం లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు ప్రకటనలు చేసిన కేంద్రం పండుగ వంటి విషయాలను చెప్పింది.
గ్రామీణ ప్రాంతాల రైతులకు, కార్మికులకు శుభవార్త
వ్యవసాయం ఆధారంగా జీవించే కోట్లాది కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి ఈ బడ్జెట్ ఉద్దేశించబడింది అని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. సాంప్రదాయ వ్యవసాయానికి తోడు, అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో స్థిరమైన ఆదాయ మార్గాలు సృష్టించటం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు.

500 జలాశయాలు మరియు అమృత్ సరోవర్ ల సమగ్ర అభివృద్ధికి ప్లాన్
ఇక ఈ బడ్జెట్ లో ముఖ్యంగా 500 జలాశయాలు మరియు అమృత్ సరోవర్ ల సమగ్ర అభివృద్ధికి తగిన ప్రాధాన్యతను ఇచ్చారు. దీనివలన సాగునీటి లభ్యత పెరిగి పంట దిగుబడులు మెరుగవుతాయని నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది పెద్ద ఊరట అని పేర్కొన్నారు. అలాగే వీటి ఏర్పాటు వల్ల వరదలు, ఎండల ప్రభావం తగ్గి వ్యవసాయం మరింత స్థిరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం
మత్స్య సంపద అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మత్స్యకారులకు శుభవార్త చెప్పారు. చేపల పెంపకం, రొయ్యల సాగు వంటి రంగాలకు మద్దతు పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఉంటాయని, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, తోటల పంటలు వంటి అనేక రంగాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చినట్టు అవుతుందన్నారు.
కొబ్బరి రైతులకు, జీడిపప్పు, కోకో, మరియు గంధపు రైతులకు ప్రోత్సాహకాలు
రైతులు తమ పంటలతో పాటు అనుబంధ కార్యకలాపాలతో కూడా ఆదాయాన్ని సంపాదించవచ్చని నిర్మల సీతారామన్ వెల్లడించారు. కొబ్బరి రైతులకు, జీడిపప్పు, కోకో, మరియు గంధపు రైతులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. అంతేకాదు డిజిటల్ వ్యవసాయం దిగుబడిని మెరుగుపరచడానికి, నష్టాలను నిర్వహించడానికి, ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఏఐతో డిజిటల్ వ్యవసాయం.. రైతుల కోసం కీలక నిర్ణయాలు
ఏఐ తో డిజిటల్ వ్యవసాయం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా నిర్వహించడానికి కేంద్రం తమ వంతుగా సహకారం అందిస్తుందన్నారు. ఇలా సామాన్య రైతాంగానికి, కార్మికులకు మేలు కలిగేలా కేంద్ర బడ్జెట్ ఉండడంతో గ్రామీణ కార్మికుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications