ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వరాలు..!!
అమరావతి: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపీ, తెలంగాణల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై వరాల జల్లును కురిపించింది. వాటిని పూర్తి చేయడానికి, విస్తరణ పనులను చేపట్టడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవ్వాళ దేశ రాజధానిలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. సుమారుగా అయిదు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. విశ్వకర్మ పథకాన్ని అమలు చేయడానికీ అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకం అమలు చేయనుంది.

అదే సమయంలో- ఏపీ, తెలంగాణల్లో పెండింగ్‌లో ఉన్న కొన్ని రైల్వే ప్రాజెక్టులపైనా ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో ఎంపిక చేసిన ఏడు మార్గాల్లో పట్టాల ఆధునికీకరణ, వాటి స్థాయిని పెంచడం, డబ్లింగ్ పనులు చేపట్టడం, విద్యుదీకరణ.. వంటి పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించిన వివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లల్లో రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపర్చడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

మొత్తం మీద ఈ ఏడు రాష్ట్రాల్లో 2,339 కిలోమీటర్ల మేర పట్టాల ఆధునికీకరణ, డబ్లింగ్ పనులను చేపట్టనుంది కేంద్రం. దీనికోసం 32,500 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. ఇందులో గుంటూరు- బీబీనగర్ సెక్షన్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్‌ను చేర్చింది. 272.69 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి అయ్యే ఖర్చు 3,238.38 కోట్ల రూపాయలు.
గోరఖ్‌పూర్ కంటోన్మెంట్- వాల్మీకి నగర్, సోన్ నగర్-అందల్, నెర్గుండి-బరంగ్, ఖుర్దా రోడ్- విజయనగరం, ముద్ఖేడ్-మేడ్చల్, మహబూబ్ నగర్- డోన్, ఛోపాన్- ఛునార్ ఉన్నాయి. ఖుర్దారోడ్- విజయనగరం మధ్య త్రిపుల్ లేన్‌కు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మార్గంలో ప్రస్తుతం డబ్లింగ్ అందుబాటులో ఉంది.
ముద్ఖేడ్- మేడ్చల్, మహబూబ్‌నగర్- డోన్ సెక్షన్ల మధ్య డబ్లింగ్ కోసం 5,655.40 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. ఈ రెండు సెక్షన్ల మధ్య 502.34 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులను కేంద్రం చేపట్టనుంది. నెర్గుండి-బరంగ్, ఖుర్దా రోడ్- విజయనగరం మధ్య 5,618.26 కోట్ల రూపాయలతో 417.6 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లేన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications