వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపి కబురు: గతంలో టైం పట్టేదని కానీ: జవదేకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ తీపి కబురు అందించారు. అనంతపురం జిల్లా జంతలూరులో కేంద్ర విశ్వవిద్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారుసీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారు

Union Cabinet has approved Central Universities Bill, 2018 to set up Central University of Andhra Pradesh

సెంట్రల్ యూనివర్సిటీస్ (అమెండ్‌మెంట్) బిల్ 2018కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీకి పచ్చ జెండా ఊపిందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉన్నత విద్యారంగంలో ఏపీకి ఇదో మైలురాయి అన్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు. గతంలో ఈ తతంగం ముగిసేందుకు చాలా సమయం పట్టేదని, తొలుత కేబినెట్ నిర్ణయం తీసుకునేదని, ఆ తర్వాత పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యేదన్నారు.

ఇదంతా పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టేదని, దీని వల్ల ఓ విద్యా సంవత్సరం వృథా అయ్యే అవకాశముందని, కానీ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేగంగా ఏపీకి యూనివర్సిటీని మంజూరు చేశామన్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఈ సెంట్రల్ వర్సిటీలో అకడమిక్ సెషన్ ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభదశలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెంటార్‌షిప్ కింద ఈ సెంట్రల్ వర్సిటీ పని చేస్తుందని, కేంద్రం నిర్ణయంతో ఏపీ ప్రజలు సంబరాలు చేసుకుంటారన్నారు.

English summary
Union Cabinet has approved Central Universities (Amendment) Bill, 2018 to set up Central University of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X