టిడిపిVsబిజెపి: నిధుల విడుదలపై చర్చకు రెఢీ: సోము వీర్రాజు, శ్వేత పత్రం ఇవ్వండన్న బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షం కంటే మిత్రపక్షమైన బిజెపి నేతలు టిడిపిపై ఒంటికాలితో విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపిలో ఒకరిద్దరూ నేతలు టిడిపిలోని నేతలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టిడిపిపై విమర్శలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీల్లో 90 శాతం నెరవేర్చించదని సోము వీర్రాజు గురువారం నాడు స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం నుండి నిధుల విడుదల విషయమై టిడిపి చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీకి ఇచ్చిన హమీల్లో 90 శాతం నెరవేర్చామని చెప్పారు. టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రకటించారు.

మిత్రపక్షమైన బిజెపి నేతలు టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఎదురుదాడికి దిగుతోంటే టిడిపి నేతలు కూడ బిజెపి పై అదే రీతిలో విమర్శలుల గుప్పించారు.రెండు పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం విపక్ష వైసీపీకి రాజకీయంగా కలిస్తోంది.

టిడిపి నేతలు బహిరంగ చర్చకు సిద్దమా

టిడిపి నేతలు బహిరంగ చర్చకు సిద్దమా

ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన 90 శాతం ఇచ్చిన నిధుల్లో ఇప్పటివరకు 90 శాతం హమీలను నెరవేర్చినట్టు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి అవసరమైన నిధును సమకూరుస్తున్న టిడిపి నేతలు బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం నుండి ఇప్పటివరకు అమలు చేసిన హమీల విషయమై బహిరంగ చర్చకు సిద్దమా అని సోము వీర్రాజు టిడిపి నేతలకు సవాల్ విసిరారు.

బిజెపిని నమ్మి మోసపోయాం,2 ఏళ్ళ క్రితమే రాజీనామా, పవన్ రాజకీయాలకు పనికిరాడు:జెసి

ప్రత్యేక హోదాపై పార్టీల డ్రామాలు

ప్రత్యేక హోదాపై పార్టీల డ్రామాలు

ప్రత్యేక హోదాపై ఒక పార్టీ డ్రామాలు ఆడుతోంటే, మరో పార్టీ రాజీనామాలంటూ కొత్త డ్రామాకు తెరలేపారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాలో అమలు చేసేలా ప్రత్యేక ప్యాకేజీని ఏపీకి అమలు చేస్తున్న విషయాన్ని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గుర్తు చేశారు.ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ఏపీకి ఇచ్చిన అన్ని హమీలను అమలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని వీర్రాజు చెప్పారు.

ఎంపీలు రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదు: చింతా మోహన్ సంచలనం

కేంద్రం ఏమిచ్చిందన్న బాబు

కేంద్రం ఏమిచ్చిందన్న బాబు

కేంద్రం నుండి రాష్ట్రానికి ఇచ్చిన హమీల్లో 90 శాతం హమీలను నెరవేర్చినట్టు బిజెపి నేతలు చేస్తున్న ప్రచారాన్ని టిడిపి కొట్టిపారేసింది. టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపి తీరును తప్పుబట్టారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందన్న విషయమై లెక్కలు తీసి చూపాలని బిజెపిని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

కేంద్రమే శ్వేతపత్రం ఇవ్వాలి

కేంద్రమే శ్వేతపత్రం ఇవ్వాలి

కేంద్రం నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని బిజెపి నేతలు చేస్తున్న ప్రచారం విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.కేంద్రం నుండి ఏ మేరకు నిధులు కేటాయించారనే విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.కేంద్రం నుండి ఎన్ని నిధులు మంజూరు చేశారనే విషయమై ఎవరూ చెప్పలేదని బాబు గుర్తు చేశారు.బీజేపీ లెక్కలు తీసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjp MLC Somu veerraju said that union government 90 percent promises fulfilled to Andhra Pradesh. He spoke to media on Thursday at Eluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X