ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ప్రధాన్ ప్రశంసలు: మోడీతో పోల్చుతూ కామెంట్లు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలిపారు. విశాఖపట్నంలోని 1000 పడకల జంబో కరోనా ఆస్పత్రిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌పై ప్రశంసలు కురిపించారు.

ప్రధాని మోడీతో సీఎం జగన్‌ను పోల్చుతూ ప్రశంసలు

ప్రధాని మోడీతో సీఎం జగన్‌ను పోల్చుతూ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమున్న లక్షణమైన నాయకులని కేంద్రమంత్రి కొనియాడారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి రెండో టర్మ్‌లో రెండేళ్లు పూర్తి చేసుకుంటే.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండేళ్లు సీఎంగా పదవీకాలం పూర్తి చేసుకున్నారని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

ఏపీ సర్కారు కరోనా కట్టడికి నిరంతరం పనిచేస్తోంది..

ఏపీ సర్కారు కరోనా కట్టడికి నిరంతరం పనిచేస్తోంది..

వైద్య సదుపాయాల కల్పన, మంచి నిర్ణయాలు, పనులకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న రాష్ట్రం ఏపీ అని ప్రశంసించారు. కరోనా నియంత్రణకు నిరంతరం పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనాను ఎదుర్కోగలమని కేంద్రమంత్రి ప్రధాన్ వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు

ఏపీ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు

మెగా మెడికల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్న ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గించడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రబావం తగ్గించేనట్లేనని అన్నారు. అన్నిరంగాల్లో ముందుండి, అన్ని అంశాల్లో చొరవ తీసుకుని, ముందుకెళుతున్న మిగితా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ఏపీ బీజేపీ నేతలకు షాకిచ్చిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు..

ఏపీ బీజేపీ నేతలకు షాకిచ్చిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు..

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ బీజేపీ నేతలు విమర్శిస్తుండగా. ఇలా కేంద్రమంత్రులు సీఎం జగన్ పై ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక బీజేపీ నేతలను మరింత ఇరకాటంలో పెట్టేలా వారి వ్యాఖ్యలున్నాయి.

కాగా, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడేళ్లు కాగా, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేసిన, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వెల్లడిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+