Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vizag Steel: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్ చెప్పిన కుమారస్వామి..!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగీకరించిందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి దీన్ని సందర్శించారు. గత ఎన్డీయే సర్కార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెరతీసిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ప్రస్తుతం కేంద్రం మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో వాస్తవ పరిస్ధితులు తెలుసుకునేందుకు ఆయన ఇవాళ పర్యటిస్తున్నారు.

అయితే ఇవాళ ఉదయం విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి.. సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ప్లాంట్ ను ఆద్యంతం పరిశీలించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ పేరెత్తకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆందోళన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారని కుమారస్వామి గుర్తుచేశారు. కాబట్టి దీన్ని రక్షించడం తమ బాధ్యతన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ ప్లాంట్ వంద శాతం సామర్ధ్యంతో తిరిగి ఉత్పత్తి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

union minister hd Kumaraswamy good news to vizag steel plant

మరోవైపు ప్లాంట్ సందర్శన అనంతరం కుమారస్వామి అక్కడి విజిటర్స్ డైరీలో తన అభిప్రాయం పంచుకున్నారు. "ఈ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తరువాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధి కి సహాయపడుతుంది అని అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజు వారి అవసరాలు , జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత.
ఈ ప్లాంట్ మూతపడుతుంది అని మీరు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. ప్రధానమంత్రి గారి అశీసులు, సహాయం తో ఈ ప్లాంట్ 100% సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుంది." అని తెలిపారు.

ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పట్లో ముందుకెళ్లడం లేదని మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కుమారస్వామి కూడా ఆందోళన అవసరం లేదని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తగు సమయంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కార్మికులు, ఉద్యోగుల్లో భరోసా నింపేలా ఉన్నాయని చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+