ఏపీలో వచ్చే ఎన్నికల పొత్తులపై కేంద్రమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో పొత్తులకు సంబంధించి ఇప్పటికే ఆసక్తిగల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళతారని వైసిపి పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది. ఏపీలో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఆలోచనలు సాగిస్తున్న సమయంలో వైసీపీ సింగిల్ గా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవటానికి సిద్ధమైంది.
జనసేన, టీడీపీ మధ్య పొత్తులు ఉంటాయన్నది క్లియర్. అయితే టిడిపి, జనసేన తో పాటు బిజెపి చేరుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక ఈ సమయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తూ ఏపీలో ఆగిన కేంద్రమంత్రి ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .

తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సంవత్సరంలో ఏపీలో టీడీపీ, జనసేన తో పొత్తు పెట్టుకుని వెళతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తామని కూడా మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు.
బెంగళూరు నుండి రోడ్డు మార్గం ద్వారా పావగడ కు వెళుతున్న క్రమంలో అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన ఆగారు. ఈ క్రమంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఎన్డీఏలో బీజేపీతో ఏ పార్టీలు ఉన్నాయో 2024 ఎన్నికల్లో వాటన్నింటినీ కలుపుకొని వెళతామని నారాయణస్వామి తెలిపారు.
ఏపీలో టీడీపీ మద్దతు కొనసాగుతుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీలో తాము ఎన్డీయే పక్షాలతో కలిసి పోటీ చేస్తామని పేర్కొన్న నారాయణస్వామి, రాష్ట్రంలో బిజెపికి మంచి వాతావరణం ఉందన్నారు.ఏపీలో పార్టీని బలోపేతం చేయడం కోసమే పురంధరేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించినట్టుగా కేంద్ర మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications