ఇండియా పాక్ యుద్ధం.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ కేటగిరీ భద్రత, చంద్రబాబుకు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి భద్రత పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై కేటగిరి భద్రత ఉండ గా ఇప్పుడు ఆయనకు వై ప్లస్ కేటగిరీ కేటాయించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి పెంచిన భద్రతతో ఆయనకు రాష్ట్ర పోలీసుల తరపున ఇద్దరు గన్ మెన్ లతోపాటు మరో ఇద్దరు సిఆర్పిఎఫ్ అధికారులు భద్రత కల్పిస్తారు.

భారత్ పాక్ యుద్ధంతో అలెర్ట్
రామ్మోహన్ నాయుడు వెంబడి నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కేంద్రం భద్రత పెంచింది. భారత్ ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క ఉగ్ర స్థావరాల పైన దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Union Minister Rammohan Naidu gets Y Plus category security key orders on Chandrababu securiy

రామ్మోహన్ నాయుడి భద్రత పెంపు.. చంద్రబాబు భద్రతకు పటిష్ట చర్యలు
రామ్మోహన్ నాయుడు భద్రతను వై ప్లస్ కేటగిరీకి పెంచడంతో కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సిఆర్పిఎఫ్ కమాండో ఆయనకు భద్రతగా విధుల్లో చేరారు.ఇక మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సైతం భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు.

ఏపీలో ఉన్నతాధికారుల హైలెవల్ రివ్యూ
ఆపరేషన్ సిందూర్ తర్వాత వివిధ ప్రాంతాలలో చేపట్టిన భద్రతా చర్యలు, వివిధ సంస్థల రక్షణ, ప్రజలతో పాటు వీఐపీల భద్రత ఏపీలో ఉన్నతాధికారులు హై లెవెల్ రివ్యూ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా తో పాటు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి భద్రతా చర్యలపై కీలక ఆదేశం
ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపైన, తీసుకోవలసిన చర్యలపైన సమీక్షలో పాల్గొని సీఎం చంద్రబాబు భద్రతకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. .మరింత పటిష్టంగా ముఖ్యమంత్రి భద్రతా చర్యలు ఉండాలని పేర్కొన్నారు. సెక్యూరిటీకి సంబంధించిన ప్రోటోకాల్స్ తూచా తప్పకుండా పాటించాలని ఆదేశాలిచ్చారు. అంతేకాదు జనసమూహం లో చంద్రబాబు రక్షణకు పాటించాల్సిన నిబంధనలపైన, ప్రత్యేక ఏర్పాట్లపైన దృష్టి పెట్టాలన్నారు. సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు ఏపీ డీజీపీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+