హోదా అడుగుతున్నారు, ఏపీకి త్వరలో తీపి కబురు!: గల్లాకు కేంద్రమంత్రి
త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ఫలాలు అందుతాయని కేంద్రమంత్రి లోకసభ సాక్షిగా ఈ రోజు వెల్లడించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే తీపి కబురు అందుతుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు వెల్లడించింది. త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ఫలాలు అందుతాయని కేంద్రమంత్రి లోకసభ సాక్షిగా ఈ రోజు వెల్లడించారు.
ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు త్వరలోనే విడుదల అవుతాయని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. లోకసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ లిఖితపూర్వక జవాబు చెప్పింది.

గతంలో ఏ రాష్ట్రానికీ చేయని సాయాన్ని ఏపీకి చేస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రానికి చెందిన నేతలు ప్రత్యేక హోదా అడుగుతున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేశామని చెప్పారు. ప్యాకేజీ ఫలితాలు త్వరలో వస్తాయని చెప్పిన కేంద్రమంత్రి.. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 2014 నుంచి పోలవరానికి రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బును తిరిగి ఇస్తామని ఆర్థిక శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications