రాత్రి టీడీపీ ఎంపీ గరికపాటి ఇంటి వద్ద దుండగుల హల్‌చల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు ఇంటి వద్ద శనివారం రాత్రి దండగులు హంగామా సృష్టించారు. ఎంపీ గరికపాటి డ్రైవర్, పీఏ పైన దుండగులు దాడి చేశారు. దాడి సమయంలో గరికపాటి ఇంట్లో లేరు.
దుండగుల దాడిలో డ్రైవర్, పీఏలిద్దరికీ గాయాలయ్యాయి. గరికపాటి స్వయంగా ఆదివారం ఉదయం ఏసీపీకి పిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదయం పోలీసులు ఎంపీ గరికపాటి నివాసానికి వచ్చి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సీసీటీవీ పుటేజీలను కూడా పరిశీలించారు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు జరగలేదని గరికపాటి చెప్పారు. ఈ ఘటన రాత్రి తాను లేని సమయంలో జరిగిందన్నారు. ఈ విషయం తెలియడంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంపీ గరికపాటికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications