కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నలుగురి కిడ్నాప్ కలకలం: ముసుగులు ధరించి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో కిడ్నాప్ కలకలం రేపింది. మంత్రాలయంలో నలుగురు విద్యార్థులు గురువారం నాడు అదృశ్యమయ్యారు. వారిని బెంగళూరులోని ఓ గోడౌన్‌లో బంధించినట్లుగా తల్లిదండ్రులకు సమాచారం అందింది. విద్యార్థులు స్థానికంగా చదువుకుంటున్నారు. పొద్దున వెళ్లిన వారు రాత్రి అయినా రాలేదు.

దీంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అయితే, తమను ముసుగు ధరించిన కొందరు కిడ్నాప్ చేశారని వారు తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. వారిని బెంగళూరులోని ఓ గోడౌన్‌లో ఉంచినట్లుగా సమాచారం అందించారు. తమతో పాటు మరో ఇరవై ముప్పై మంది పిల్లలు ఉన్నారని పిల్లలు చెప్పారు. తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు. పిల్లలు చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా పిల్లలు ఎక్కడున్నది పోలీసులు ఆచూకీ కనుగొన్నారు.

21 మంది విద్యార్థులకు అస్వస్థత

Unknown persons kidnap four students

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని కరకముక్కల గ్రామానికి చెందిన 21 మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్నం జొన్నపంటకు మందు వేసేందుకు వెళ్లి అ స్వస్థతకు లోనయ్యారు. పాఠశాలలో అర్థ వార్షిక పరీక్ష పూర్తవగానే.. కొందరు వి ద్యారులు విడపనకల్లు గ్రామానికి చెంది న ఓ రైతు పొలంలో జొన్నపంటకు మందు చెల్లేందుకు వెళ్లారు.

విష ప్రభావానికి వారు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని విడపనకల్లు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 12 మంది విద్యార్థులకు సె లైన్లు ఎక్కించారు. మిగిలిన విద్యార్థులకు ప్రథమ చికిత్సలు నిర్వహించి, గ్లూకోజ్‌, మజ్జిగ అందించారు.

బాధిత విద్యార్థులందరూ 8, 9, 10వ తరగతుల వారే. అస్వస్థతకు లోనైన వారిలో నందిని, సువర్ణ, శిరిష, శ్రీనివాసులు, జ్యోతి, శివ, గాయత్రి, సురేష్‌తో పాటు మరో 13 మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ ప్రతాప్‌నాయుడు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు.

పదిమంది ఎర్ర చందనం దొంగల అరెస్టు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు - అక్కుర్తి మధ్య బుధవారం రాత్రి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న పదిమందిని రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్‌ సీఐ ఎస్‌సీ గౌస్‌ కథనం మేరకు... ముందస్తు సమాచారంతో అక్కుర్తి రైల్వే గేటు సమీపంలో మూడు వాహనాలను ఆపగా అందులో 1,020 కేజీల బరువున్న 41 ఎర్రచందనం దుంగలు ఉన్నాయన్నారు.

English summary
Unknown persons kidnap four students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X