ఏపీలో ఆటోడ్రైవర్లకు రూ.15,000 దసరా బహుమతి: అక్టోబర్ 1కి డబ్బులొచ్చేస్తాయ్

Good News for Autodrivers: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. సూపర్ సిక్స్ పథకాలను లబ్దిదారులకు చేరవేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది.

తాజాగా వాహనమిత్ర పథకాన్ని ఆటోడ్రైవర్లందరికీ దసరా కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తోన్నట్లు వెల్లడించింది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికి అనుగుణంగా తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి లబ్దిదారులను ఖరారు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జీవో నంబర్ 33 జారీ ఇచ్చారు.

Unlock Financial Support Rs 15000 Annually for Auto Rickshaw and Cab in Andhra Pradesh

సొంతంగా ఆటోరిక్షా/మోటార్ క్యాబ్‌/మ్యాక్సీ క్యాబ్ ఉండి డ్రైవర్‌గా స్వయం ఉపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దీనికింద వారందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. వారందరినీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్లు రవాణా శాఖ పేర్కొంది. ఈ నెల 13వ తేదీ నాటికి ఉన్న పాత లబ్ధిదారుల జాబితాను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాలో ఉన్న వారికీ ఈ సహాయం అందుతుంది.

కొత్తగా దరఖాస్తులకు టీడీపీ కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో కొత్తవారు వాహనమిత్ర కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దాఖలైన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం 24వ తేదీన తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ తుది జాబితాలో పేర్లు ఉన్న వారిని అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించినట్టవుతుంది. వారందరి బ్యాంక్ అకౌంట్లలోకి అక్టోబరు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా డబ్బులు జమ చేస్తారు.

బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి అటో, క్యాబ్‌ డ్రైవర్లకు డబ్బులు అందుతాయి. రవాణా శాఖ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది ఆటో/ మోటార్ క్యాబ్‌/మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఈ పథకానికి అర్హులుగా నిర్ధారించే అవకాశం ఉంది. దీనికోసం 435 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా. మేర లబ్ధి చేకూరనుంది.

సొంతంగా ఆటో, క్యాబ్‌ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. ఆధార్‌, తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరి. ఒక కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే లబ్ది అందుతుంది. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా ఈ పథకానికి అనర్హులు అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+