టీడీపీలో చేరొచ్చుగా- పవన్‌ను సూటిగా ప్రశ్నించిన బాలయ్య: సీఎం అయిన తరువాతే చనిపోతా..!!

నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ పార్ట్ 2 ఈ నెల 10వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రసారం కానుంది.

అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది. పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇది. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందులో సందడి చేయడమే దీనికి కారణం. ఈ ఎపిసోడ్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఇదివరకే పార్ట్ 1 విడుదలైంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి.

సెకెండ్ పార్ట్..

సెకెండ్ పార్ట్..

బాలకృష్ణ- పవన్ కల్యాణ్ మధ్య చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనేది ఈ ఫస్ట్ పార్ట్ స్పష్టం చేసింది. ఇద్దరూ రాజకీయాల్లో కొనసాగుతోండటం, పైగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండటం ఆసక్తి రేపుతోంది. జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్.. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి చెందిన హిందూపురం శాసన సభ్యుడిగా బాలకృష్ణ.. వైఎస్ఆర్సీపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోన్నారు.

ఒకే వేదికపై..

ఒకే వేదికపై..

అలాంటి వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం మొదటి నుంచీ ఆసక్తి రేపుతోంది. ఎలాంటి అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వస్తాయనే విషయం ఉత్కంఠతకు గురి చేస్తూనే ఉంది. వాటన్నింటికీ తెర పడబోతోంది.. ఇంకొద్దిరోజుల్లో. ఈ లెటెస్ట్ ఎపిసోడ్ లో కూడా రాజకీయాల ప్రస్తావన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

10వ తేదీన..

పవన్ కల్యాణ్ తో చిత్రీకరించిన రెండో పార్ట్ ఈ నెల 10వ తేదీన ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. తొలి భాగంలో కంటే రెండో భాగంలో రాజకీయాల ప్రస్తావన విస్తృతంగా కనిపించింది. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు.. పవన్ కల్యాణ్ ఎలాంటి జవాబులు ఇచ్చారనే విషయం.. ఈ నెల 10వ తేదీన తేలిపోనుంది. వారిద్దరు కనిపించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 ఎపిసోడ్ రెండో భాగం 10వ తేదీన రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.

టీడీపీలో చేరొచ్చుగా..

టీడీపీలో చేరొచ్చుగా..

ఈ ఎపిసోడ్ లో ఒక దశలో బాలకృష్ణ.. యు కుడ్ జాయిన్ తెలుగుదేశం అంటూ నేరుగా పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడిగారు. దీనికి ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారనేది 10వ తేదీన తేలిపోతుంది. కారు టాప్ పై కూర్చుని ఇప్పటానికి వెళ్లిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కారులో వెళ్లకూడదు, కారు నుంచి బయటికి రాకూడదు.. అంటూ అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసిందని పవన్ బదులిచ్చారు.

అటెంప్ట్ మర్డర్ కేసులు..

అటెంప్ట్ మర్డర్ కేసులు..

తనపై అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఆధిపత్య ధోరణి మితిమీరిందని, ఎవ్వరూ తనకు ఎదురు చెప్పకూడదని, అది ఒక డిక్టేటోరియల్ విధానానికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ వల్ల లబ్దిపొందిన ఓ వయోధిక వృద్ధురాలు ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా కనిపించారు. కరోనా వల్ల తన ఇద్దరు కొడుకులు చనిపోయారని, మూడో కుమారుడికి పవన్ అండగా ఉన్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిన తరువాతే చనిపోతానని చెప్పారామె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+