ప్రధాని మోదీతో ఉపాసన భేటీ - జరిగిందేంటి..!!
మెగా ఇంటి కోడలు... కొణిదెల ఉపాసన తాజాగా సోషల్ మీడియలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఉపాసన.. దుబాయ్ 2020 ఎక్స్‌పోను సందర్శించారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీని కలిసారు. ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. తనకు ప్రధాని నరేంద్ర మోదీని దుబాయ్ 2020 ఎక్స్‌పో వద్ద భేటీ అవ్వడం ఎంతో గౌరవప్రదంగా ఉందన్నారు. దీనికి సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో చేసిన పోస్టులో తన అభిప్రాయాలను వ్యక్తం చేసారు.
ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్ష, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలుగా పేర్కొన్నారు. ఎక్స్ పో కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. పిల్లలను అక్కడికి తీసుకెళ్లండి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మిస్ అవ్వకండి అంటూ సూచించారు. అయితే, ప్రధాని మోదీతో ఇప్పుడు ఉపాసన భేటీ అయినట్లుగా ప్రచారం సాగింది. ఆమె అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని మోదీ పక్కన కూర్చున్నట్లు ఫోటో దిగారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టా పోస్ట్‌లో మెన్షన్ చేశారు.

కానీ, ఉపాసన నిజంగానే మోదీతో ముఖా ముఖి భేటీ అయినట్లు వార్తలు రాసుకొచ్చాయి. అగ్‌మెంటెడ్ రియాలిటీ అనేది సాంకేతికతో మనిషి చూసే వాస్తవ దృశ్యాన్ని పూర్తిగా కంప్యూటర్ ద్వారా కల్పిత దృశ్యంతో భర్తీ చేస్తుందని చెబుతున్నారు. వాస్తవ దృశ్యాల్లో కల్పిత వస్తువులను కంప్యూటర్ సహాయంతో ఇమడింపచేసి చూపే నిరంతర ప్రక్రియగా విశ్లేషిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఉపాసన ప్రధాని కలవటం పైన ఇన్ స్టాలో క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications