జనసేన తరఫున మొదటి అభ్యర్థి ఖరారు
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసే మొదటి అభ్యర్థిగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఆయన పోటీచేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
గతంలో రెండుసార్లు ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగి మూడోస్థానంలో నిలిచారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర, అత్తోటలో మనోహర్ పర్యటించారు. నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. మార్కెట్ యార్డు నిర్వహించేందుకు కొల్లిపర రైతులను కూడా భాగస్వాములను చేశానన్నారు. కృష్ణా నదిలో రూ.350 కోట్ల వ్యయంతో చెక్ డ్యాం నిర్మించేందుకు అంచనాలు రూపొందించామని, తనకు ఎమ్మెల్యేగో మరోసారి అవకాశమిస్తే రైతుల కలను నెరవేరుస్తానన్నారు.

అత్తోట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూపాయి కూడా సహాయం అందలేదని తెలపగా ధైర్యంగా ఉండాలని, జనసేన అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. కౌలురైతులకు పవన్ కల్యాణ్ తన సొంత డబ్బు ఖర్చుపెడతుున్నారని, త్వరలోనే ఇక్కడ కూడా పర్యటించి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులను పరామర్శించడంతోపాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నారని మనోహర్ తెలిపారు.












Click it and Unblock the Notifications