నక్కతోక తొక్కుతున్న ఉత్తరాంధ్ర.. మరో కొత్త ప్రాజెక్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కారణంగా నక్క తోక తొక్కుతోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెరుపు వేగంతో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా మరొక శుభవార్త చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

భువనేశ్వర్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కొత్త రహదారి
రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విమానాశ్రయాన్ని సులభంగా వేగంగా చేరుకునేలా కొత్త రహదారిని నిర్మించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ రహదారి నిర్మాణానికి చర్యలు ముమ్మరం చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భువనేశ్వర్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ కొత్త రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుందని, ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతోందని అన్నారు.

uttarandhra is experiencing good fortune with union minister rammohan naidu another project

విమానాశ్రయం, రహదారి కనెక్టివిటీతో పారిశ్రామిక ప్రగతి
ఒకవైపు భోగాపురం విమానాశ్రయం, మరోవైపు రహదారి ప్రాంతీయ కనెక్టివిటీ తో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రహదారి కారణంగా ఒడిస్సా, ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం పారిశ్రామిక క్లస్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రమంత్రి కృషి
భవిష్యత్తు కాలంలో శ్రీకాకుళం జిల్లాలో అనేక మార్పులు వస్తాయని, నూతన శ్రీకాకుళం ఆవిష్కరణను ప్రజలు చూస్తారని, వెనుకబడిన ప్రాంతం నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా శ్రీకాకుళం కనిపిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పలు కీలక ప్రాజెక్టులు శ్రీకాకుళం ఆర్థిక అభివృద్ధికి ఉద్యోగ కల్పనకు గణనీయంగా తోడ్పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

ఉత్తరాంధ్ర దశ మారుస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఇదిలా ఉంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు 2026 సంవత్సరంలో పూర్తిచేసుకుని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ విమానాశ్రయానికి విశాఖపట్నం బీచ్ రోడ్డు నుండి ఆరు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. బీచ్ కారిడార్ తో పాటు మెట్రో సేవలు కూడా విమానాశ్రయానికి అనుసంధానించే పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి కావడంతో ఉత్తరాంధ్ర దశ దిశ మారిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+