Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి పాదయాత్రకు కౌంటర్ గా ఉత్తరాంధ్ర పాదయాత్ర ..మూడు రాజధానుల మద్దతుకై; వైసీపీ వ్యూహమేనా!!

ఒకపక్క రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని రాజధాని ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ అమరావతి ప్రాంత రైతులకు మద్దతు ప్రకటిస్తే వైసిపి మాత్రం అమరావతి రైతుల మహాపాదయాత్రపై మండిపడుతుంది.ఇక ఇదే సమయంలో మూడు రాజధానులు మద్దతుగా ఉత్తరాంధ్ర వేదికగా పాదయాత్ర సన్నాహాలకు శ్రీకారం చుట్టారు.

మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర పాదయాత్ర

మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర పాదయాత్ర

ఉత్తరాంధ్ర వేదికగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం సాగనున్న పాదయాత్రకు వైసీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించిన మేరకు, వారి పాదయాత్రకు మద్దతు ప్రకటించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు మద్దతు ప్రకటించే అంశంపై చర్చ జరిగింది.

అమరావతి కోసం కొనసాగుతున్న పాదయాత్ర .. కౌంటర్ గా ఉత్తరాంధ్రలోనూ

అమరావతి కోసం కొనసాగుతున్న పాదయాత్ర .. కౌంటర్ గా ఉత్తరాంధ్రలోనూ


అమరావతి ప్రాంత రైతులు రాజధాని అమరావతి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మహా పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో,మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్రలోను పాదయాత్ర ను నిర్వహించి మూడు రాజధానులకు ప్రజల మద్దతు పొందేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ పాదయాత్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల మీదుగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో అత్యధికంగా ఐదు రోజులపాటు యాత్ర నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం.

పాదయాత్ర నిర్వహణ కోసం కసరత్తు .. వైసీపీ మద్దతు ఇచ్చే ఛాన్స్

పాదయాత్ర నిర్వహణ కోసం కసరత్తు .. వైసీపీ మద్దతు ఇచ్చే ఛాన్స్

ఇక ఈ పాదయాత్రలో ఏఏ స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయి? ఎంతమంది ఈ పాదయాత్రను నిర్వహించబోతున్నారు? ఏ ఏ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది? పాదయాత్ర తో పాటుగా మూడు రాజధానులకు మద్దతుగా ఎటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి? వంటి అనేక అంశాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని వైసిపి నేతలను సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులు మద్దతుగా నిర్వహించే పాదయాత్రకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అయితే వారి పాదయాత్రకు మద్దతు ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, మద్దతు ప్రకటించే అవకాశం ఉందని వైసిపి నేతలు చెబుతున్నారు.

ప్రతి నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ సంఘీభావం

ప్రతి నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ సంఘీభావం

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ,నియోజకవర్గ ఇంచార్జ్ వైసీపీ తరఫున సంఘీభావం ప్రకటించే అవకాశంపై చర్చిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ లో ఒక్క రాజధాని ఉండాలని, అది రాజధాని అమరావతి మాత్రమే కావాలని అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తుంటే, దానికి దీటుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మూడు రాజధానులు మద్దతుగా పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించడం రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర కు కౌంటర్ గానే అన్న భావన వ్యక్తమవుతోంది.

పార్టీతో సంబంధం లేదని చెప్తున్న వైసీపీ .. పాదయాత్ర ప్లాన్ వైసీపీదేనని చర్చ

పార్టీతో సంబంధం లేదని చెప్తున్న వైసీపీ .. పాదయాత్ర ప్లాన్ వైసీపీదేనని చర్చ

మూడు రాజధానుల మద్దతు కోసం నిర్వహించే పాదయాత్రకు వైసిపితో సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ, ఖచ్చితంగా వైసీపీ నేతలే వెనకుండి ఈ పాదయాత్రను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర పాదయాత్ర అమరావతి రైతుల పాదయాత్రకు వైసిపి పోటీ పాదయాత్ర అని ఇప్పటికే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి నేరుగా పాదయాత్ర చేపట్టకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ పాదయాత్రను జరిపించడానికి సిద్ధమైందని, ఈ పాదయాత్రకు పరోక్షంగా సహకారం వైసిపి అందిస్తుందని ప్రధానంగా చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+