సజ్జల డైరెక్షన్ లో వల్లభనేని వంశీ యాక్షన్ .. మండిపడిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వర్సెస్ వైసీపీ కొనసాగుతుంది. ఇంకా నేతల మధ్య ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఒకరిపై ఒకరు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో తాజా పరిణామాలపై టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల పైన మండిపడ్డారు. సజ్జల రామకృష్ణ రెడ్డి డైరెక్షన్లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడని తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు కొల్లు రవీంద్ర. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కొల్లు రవీంద్ర వల్లభనేని వంశీ మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందని ఆక్షేపించారు.
సజ్జల డైరెక్షన్ లో వంశీ మాట్లాడుతున్నారు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణా జిల్లాకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన వల్లభనేని వంశీ ఇవాళ చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడుతున్నారు అంటూ, వారిని దారుణంగా తిడుతున్నారు అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ భాష వింటే ఆయన భార్యాపిల్లలు కూడా సిగ్గు పడతారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

మహిళలను కించపరిచేలా వల్లభనేని వంశీ వ్యాఖ్యలు
కృష్ణాజిల్లా మహిళలను కించపరిచేలా వల్లభనేని వంశీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చంద్రబాబు భిక్షతో ఎమ్మెల్యే అయిన వంశీ ఇప్పుడు సజ్జల డైరెక్షన్లో మాట్లాడుతున్నారు అంటూ కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలలోనూ తీవ్ర చర్చ జరుగుతుంది . తెలుగు తమ్ముళ్ళు వంశీ భాషపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .
టీడీపీ అధినేత చంద్రబాబుపై లోకేష్ పై వంశీ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, టిడిపి జాతీయ నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టిడిపిని చంద్రబాబు జంతుప్రదర్శనశాలగా మార్చాడని మండిపడిన వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనను తప్పుబట్టారు. లోకేష్ కు మీటర్, మోటర్, మేటర్ ఏదీ లేదని ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీ. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు మోదీని, అమిత్ షాను కలుస్తారని ప్రశ్నించారు. గతంలో వారిపై చంద్రబాబు ఎలా దాడి చేశారో అందరికీ గుర్తిందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా అంటూ ప్రశ్న
అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి చేయించిన ఘనుడు చంద్రబాబు అంటూ వల్లభనేని వంశీ మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని టెర్రరిస్టులు అని తిట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాదు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా ప్రశ్నించిన వల్లభనేని వంశీ జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల్లో సీట్లు ఉండాలని కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా సరైన సీట్లు లేవని విమర్శించారు . పక్క రాష్ట్రంలో కూడా ఉనికే లేని మీరు జాతీయ పార్టీ అని ఏ విధంగా చెప్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక నేడు పరిటాల సునీత వ్యాఖ్యలపై కూడా అయన స్పందించారు. తాను ఇప్పుడే రాజీనామా చెయ్యటానికి సిద్ధం అని ప్రకటించారు.












Click it and Unblock the Notifications