టీడీపీ గొప్ప పార్టీ.. కితాబిచ్చిన వల్లభనేని వంశీ; వ్యాఖ్యల మతలబు అదేనా? ఆసక్తికరచర్చ!!
తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని, తానెప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టలేదు అని టిడిపి రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. నిన్నటిదాకా టీడీపీపై దుమ్మెత్తిపోసిన వల్లభనేని వంశీ సడన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి ? అన్న చర్చ జరుగుతుంది. వైసీపీలో అంతర్గత పోరు నేపధ్యంలో వల్లభనేని వంశీకి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న చర్చ జోరందుకుంది.

టీడీపీకి కితాబిచ్చిన వల్లభనేని వంశీ
హనుమాన్ జంక్షన్ లో జెపిఎల్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపిన తీరుపై మాత్రమే తాను విమర్శలు చేశానని, లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే తాను విమర్శలు చేశానని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం చేశారని, టిడిపి ద్వారా అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు వెలుగులోకి వచ్చారని వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ వల్లభనేని వంశీ టీడీపీకి కితాబు ఇచ్చారు.

దుట్టా ఆరోపణలపై వల్లభనేని వంశీ ఫైర్
ఇక ఇదే సమయంలో వల్లభనేని వంశీకి స్థానిక వైసీపీ నేతలతో ఉన్న వర్గ పోరు నేపథ్యంలో తాజాగా గన్నవరం వైసిపి సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు చేసిన వ్యాఖ్యలపై వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు. తనతో కలిసి పని చేసే వాళ్ళని కలుపుకొని పోతాం అని స్పష్టం చేసిన వల్లభనేని వంశీ, తన స్థాయి కానివారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అక్రమ మట్టి తవ్వకాలపై విచారణకు తానూ సిద్ధమని సవాల్
వార్డ్ మెంబర్ గా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. మట్టి అమ్ముకునే ఖర్మ తనకు పట్టలేదని వల్లభనేని వంశీ తేల్చిచెప్పారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఇక దుట్టా వర్గం తాము వంశీతో కలిసి పని చేసేది లేదని ఇటీవల సీఎంఓలో సజ్జల రామకృష్ణా రెడ్డితో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. వైసీపీని వీడేది లేదని, వంశీకి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తే పని చెయ్యబోనని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీలో వర్గ పోరుతోనే టీడీపీకి కితాబా? వల్లభనేని యూటర్న్ తీసుకుంటున్నారా?
ఇక వల్లభనేని వంశీ తాజా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని విడనాడి వైసిపి బాట పట్టిన తరువాత వైసిపి లో ఉన్న నేతలందరూ వల్లభనేని వంశీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇక అధిష్టానానికి కూడా వల్లభనేని వంశీ తో కలిసి పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. అనేకమార్లు గన్నవరంలో వైసిపి నాయకులకు వల్లభనేని వంశీకి సయోధ్యకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో వల్లభనేని వంశీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని పొగడటం వెనుక ఆయన యుటర్న్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications