Vande Bharat:విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..!
ఏపీలో ప్రస్తుతం ప్రయాణాలు సాగిస్తున్న వందే భారత్ (vande bharat) రైళ్లలో ప్రధాన, కీలక మార్గం విజయవాడ-విశాఖపట్నం. తెలుగు రాష్ట్రాల వారీగా చూసుకుంటే సికింద్రాబాద్-విశాఖపట్నం. ఈ మార్గంలో ప్రస్తుతం ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుకు ఎంతో డిమాండ్ ఉంది. వంద శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు ఈ రైలులో అధికారులు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో మార్పు చేశారు.
వందేభారత్ లో 4 అదనపు కోచ్ లు
ఇప్పటికే భారీ డిమాండ్ తో ప్రయాణాలు సాగిస్తున్న విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ 16 కోచ్ లతో ప్రయాణాలు సాగిస్తున్న ఈ ప్రీమియం రైలుకు ఇప్పుడు మరో నాలుగు కోచ్ లు తగిలించారు. దీంతో ఇకపై 20 కోచ్ లతో ఈ రైలు ప్రయాణాలు సాగించబోతోంది. అంటే ఆ మేరకు ప్రయాణికులకు అదనపు టికెట్లు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి.

వందేభారత్ లో అదనంగా 312 సీట్లు
దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేసిన తాజా మార్పు తర్వాత విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలులో మొత్తం కోచ్ లు 20కి చేరగా.. ఇందులో ఏసీ చైర్ కార్‌కోచ్‌లు 18, ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్‌లు రెండు ఉన్నాయి. అలాగే ఇప్పటివరకూ 1,128గా ఉన్న సీట్ల సంఖ్య కాస్తా 1,440కు పెరిగింది. దీంతో ప్రయాణికులకు అదనంగా 312 సీట్లు లభించినట్లయింది. విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 2.20 గంటలకు చేరుకుంటుందది. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రి 11.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications