విజయవాడ మీదుగా రెండు వందే భారత్ స్లీపర్ రైళ్ళు.. ఏపీ పంట పండినట్టే!
భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సేవలను విస్తరించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సికింద్రాబాద్, విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లను నడుపుతోంది. అయితే త్వరలో మరొక శుభవార్త చెప్పడానికి రైల్వే రెడీ అవుతున్నట్టు సమాచారం. త్వరలో భారత దేశంలో ట్రాక్ ఎక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిపే ప్రణాళికలను రైల్వే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
విజయవాడ డివిజన్ మీదగా వందే భారత్ స్లీపర్ రైళ్ళ ప్రతిపాదన
ముఖ్యంగా విజయవాడ నుంచి రెండు మార్గాలలో ఈ రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపైన రైల్వే అధికారుల నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. విజయవాడ డివిజన్ మీదగా వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఎక్కువ రద్దీగా ఉండే విజయవాడ- విశాఖపట్నం, విజయవాడ- సికింద్రాబాద్ మార్గాలలో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ రైళ్ళు
ఇప్పటికే వందే భారత స్లీపర్ రైళ్లను డిసెంబర్లో ప్రారంభించడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ కూడా ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి ప్రయాణికుల సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అత్యధిక సదుపాయాలతో వందే భారత స్లీపర్ కోచ్ లను రూపొందించారు. ట్రయల్ రన్ తర్వాత సీట్లు, బోగిలలో కొన్ని మార్పులు చేశారు.
ప్రస్తుతం ఏపీలో రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు
ఈ అత్యాధునిక రైళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్లీపర్ రైళ్లు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు మార్గాలలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మరియు సికింద్రాబాద్ లను కలుపుతూ నడుస్తోంది.
ఏ మార్గాలలో వందేభారత్ స్లీపర్ రైళ్ళు ఇస్తారో
మంగళవారం రోజు తప్ప సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ మరియు తిరుపతి లను కలుపుతూ సాగుతుంది. ఇవి పగటిపూట ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తున్న రైళ్ళు కాగా, ఇక వందే భారత్ స్లీపర్ రైళ్ళు స్లీపర్ సేవలతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు భిన్నంగా సుదూర ప్రయాణాల కోసం, పడుకుని ప్రయాణం చేసేలా రూపొందించబడినవి. ఏపీలో రెండు రైళ్లకు ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో ఏ మార్గాలలో వీటిని ఇస్తారు అనేది త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications