దమ్ముంటే ఆ పని చెయ్యండి.. పవన్ కళ్యాణ్ కు వంగా గీత సవాల్!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవులు పర్యావరణ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పాలనలో తన మార్కు చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వరుస సమీక్షలతో శాఖల ప్రక్షాళనకు రంగంలోకి దిగారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో పవర్ స్టార్ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆయన పరిధిలో ఉన్న శాఖలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి చేయాలని, ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. శేషాచలామ్ అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ వెనుక ఉన్న కింగ్ పిన్ లను అరెస్ట్ చెయ్యాలన్నారు. ఇక అంతకుముందు వైసీపీ నేతలు పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ వెనుక ఉన్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

పవన్ కళ్యాణ్ కు వంగా గీత సవాల్
పిఠాపురం పర్యటన సమయంలోనే నేపాల్ కు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసిన గ్యాంగ్ వెనుక ఉంది పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకుల సపోర్ట్ తోనే దందా జరుగుతుందన్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోపణలపై స్పందించిన వంగా గీత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పదేపదే ఆరోపణలు చేయడం కాదని విచారణ చేసి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని వంగా గీత పేర్కొన్నారు.
విచారించి నిగ్గు తేల్చండి
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఎలాంటి విచారణకైనా తాము భయపడేది లేదని విచారణ జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పదేపదే ఆరోపణలు చేసి, వ్యక్తులను ఇబ్బంది పెట్టే కన్నా, విచారణ చేస్తే అసలు విషయం బయట పడుతుందన్నారు. నేరం రుజువైతే చర్యలు తీసుకోవాలని వంగా గీతా అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలపై వంగా గీత ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయకుండా వైసిపి పార్టీ భవనాలను కూల్చివేయడం దారుణమని వంగా గీతా అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications