Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ నేతలను చెప్పులతో కొడతాం, ఎవర్నీ వదలం; తాట తీస్తాం: వంగలపూడి అనిత, దేవినేని ఉమా ఫైర్

అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న తీరు ఏపీ టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అసెంబ్లీలో వైసీపీ నేతల తీరుపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఏపీ అసెంబ్లీని బూతు పురాణంగా మార్చేశారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపణలు గుప్పించారు. అసెంబ్లీ అరాచకాలకు అడ్డాగా మారిందని జగన్ రెడ్డి సీఎం కాదు ముఠా నాయకుడు అంటూ మండిపడుతున్నారు. ఎన్టీఆర్ బిడ్డ పై నిందలు వేసినా నాని, 'కాం' బాబు లకు కౌరవులకు పట్టిన గతే పడుతుందని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలను చెప్పులతో కొడతాం : వంగలపూడి అనిత

కేటుగాళ్ళు అందరూ అసెంబ్లీలో కూర్చున్నారని, వైసీపీ నేతలు వీధి రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తున్నారని వంగలపూడి అనిత అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎం భార్యపై ఇష్టానుసారంగా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోరా అంటూ వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. సీఎం జగన్ తల్లి, చెల్లి కూడా ఒక మహిళ అని గుర్తు పెట్టుకోవాలని అనిత ధ్వజమెత్తారు. జబర్దస్త్ హీరోయిన్ ఈరోజు సంక్రాంతి దీపావళి దసరా పండుగలు చేసుకుంటూ వంగలపూడి అనిత రోజాకు చురకలంటించారు. అవతలివాళ్ళు కన్నీళ్లు చూసి ఆనంద పడేది సైకోలే అంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇప్పటికి రోజా టిడిపి పునాదులపైనే నిలబడిందని, ఈ విషయాన్ని ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వైసిపి వాళ్ళు చేసిన దాడులపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భువనేశ్వరి, తెలుగు మహిళలపై ఇలాగే మాట్లాడితే వైసిపి నేతలను చెప్పులతో కొడతామని అనిత హెచ్చరికలు జారీ చేశారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహంలో కొట్టుకు పోక తప్పదు: దేవినేని ఉమా

వైసీపీ నేతలు చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకులు చేసిన వ్యక్తిగత దూషణలకు నిరసనగా గొల్లపూడి లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న దేవినేని ఉమా జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కన్నీరు పెట్టించిన వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహం లో కొట్టుకు పోక తప్పదని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలు చేయడం దుర్మార్గమైన పేర్కొన్న దేవినేని ఉమా ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో వైసిపి నాయకులు చేస్తున్నదేమిటి అంటూ తప్పుబట్టారు. శాసన సభను కౌరవ సభ గా మార్చారు అని పేర్కొన్న దేవినేని ఉమా దురహంకారంతో విర్రవీగిన కౌరవులకు పట్టిన గతే మీకు పడుతుందంటూ తేల్చి చెప్పారు.

మళ్ళీ గెలుస్తాం .. మీ తాట తీస్తాం : బోండా ఉమా

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో మాతృ సమానురాలైన చంద్రబాబు నాయుడు గారి సతీమణి పై వ్యక్తిగత దూషణలు దుర్మార్గం అంటూ బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభను కౌరవసభగా మార్చి చంద్రబాబు గారిని కన్నీరు పెట్టించిన మిమ్మల్ని ప్రజలు నడిరోడ్డు మీద పరిగెత్తించి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ గెలుస్తాం మీ తాట తీస్తాం అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు బోండా ఉమ.

Recommended Video

    Chandrababu Crying ప్రెస్ మీట్లోనే ఏడ్చేసిన చంద్రబాబు CBN Challenge In AP Assembly | Oneindia Telugu

    ఎవర్నీ వదలం ... ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం : నిమ్మల రామానాయుడు

    ఎవర్ని వదలం అంటూ చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అసభ్యకరంగా,అతి జుగుప్సాకరంగా మాట్లాడే వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు నేడు మరింత బరితెగించి సాక్షాత్తు పవిత్రమైన అసెంబ్లీలో సైతం ఆంధ్రుల ఆరాధ్య దైవమైన అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం గురించి అవమానించేలా మాట్లాడిన నేటి కౌరవ శాసనసభలో ఉండటం దురదృష్టం, సిగ్గుపడుతున్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గార్కి జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తూ చంద్రబాబు గార్ని మళ్లీ సీఎం చేసేంతవరకూ అవిశ్రాంత పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం అంటూ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+