జగన్ రెడ్డి.. ఎంతమంది మహిళల మాంగల్యాలు తెంచుతావ్? జంగారెడ్డి గూడెం మరణాలపై అనిత ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మూడు రోజుల వ్యవధిలో 16 మంది మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంత తక్కువ సమయంలో 16 మంది మరణించడం స్థానికులను విస్మయానికి గురి చేయగా వీరి మృతికి నాటుసారా విక్రయాలు కారణమని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ ధ్వజం
దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తా అని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి... మాటతప్పి మద్యం రేట్లను పెంచి తన ఆదాయాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. పెరిగిన రేట్లకు మద్యం కొనుక్కోలేని పేదలు నాటుసారా, శానిటైజర్ తదితర ప్రమాదకర మార్గాలు పట్టి మరణిస్తున్నారు అంటూ టీడీపీ జగన్ రెడ్డి ధనదాహం వల్లే జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవించాయని నాటుసారా వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతోంది.

మద్యానికి బానిసైన భర్త బయటకు వెళితే తిరిగొస్తాడా.. లేదా అని మహిళల ఆందోళన
తాజాగా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అని అర్థమవుతోందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. మద్యానికి బానిసైన భర్త బయటకు వెళితే ప్రాణాలతో ఉంటాడా లేదా అని భయపడుతూ ఆడబిడ్డలు బతకడం శాపమని వంగలపూడి అనిత పేర్కొన్నారు. కల్తీ సారా తాగడం వల్లే జంగారెడ్డిగూడెంలో ప్రజలు చనిపోయారని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్ కు మద్యపాన నిషేధం చేసే ఆలోచన ఉందా ?
మూడు దశల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మూడు మద్యం పాలసీ లు తీసుకు వచ్చాడని మొదటి దశలో మద్యం షాపులను తగ్గించినట్లు చూపించి, రెండు మూడు దశల్లో మద్యం షాపులను తగ్గించలేదని అనిత పేర్కొన్నారు.వాకిన్ స్టోర్ ల పేరుతో మూడు వందల కొత్త షాపులకు శ్రీకారం చుట్టారని అనిత విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డికి అసలు మద్యపాన నిషేధం చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు అనిత.

వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటుసారా అమ్ముతున్నారు
ఎన్నికలకు ముందు పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి ఆ దిశగా ఎందుకు ప్రయత్నించలేదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుండి బినామీలు కల్తీ మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని వంగలపూడి అనిత విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాలలో నాటుసారా ఏరులై పారుతుందని అనిత ఆరోపించారు. వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటుసారా పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని అనిత మండిపడ్డారు
Recommended Video

జగన్ రెడ్డి.. మద్యం ఆదాయం కోసం ఎంతమంది మహిళల మాంగల్యాలు తెంచుతావ్ ?
వాలంటీర్లు, వైసీపీ నేతలే నాటుసారా, గంజాయి విక్రయిస్తే జగన్ ఎందుకు నియంత్రించటం లేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. సీఎం జగన్ కు మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ సగమైనా ముఖ్యమంత్రి మహిళల మానప్రాణాల రక్షణ కోసం చూపితే బాగుంటుందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. నాటు సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్వయంగా స్పీకర్ చెప్పారని వంగలపూడి అనిత వెల్లడించారు. జగన్ రెడ్డి.. మద్యం ఆదాయం కోసం ఎంతమంది మహిళల మాంగల్యాలు తెంచుతావ్ ? అని ప్రశ్నించారు వంగలపూడి అనిత.












Click it and Unblock the Notifications