మహానటి రోజా ఏడుపు డ్రామా.. ఆ నీఛసంస్కృతి తెచ్చింది రోజానే: వంగలపూడి అనిత!!

ఏపీ మంత్రి రోజా నిన్న తెలుగుదేశం పార్టీ నేతలపైన విరుచుకుపడ్డారు. తనను టార్చర్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోజా చేసిన వ్యాఖ్యలపై, రోజా ఏడుపు పై టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరు అంతా డ్రామా నే అని, అన్ని గ్లిజరిన్ ఏడుపులని వంగలపూడి అనిత టార్గెట్ చేశారు. రోజా లాంటి మహానటిని చూస్తే నవ్వు వస్తుందని పేర్కొన్న అనిత, అసభ్య పదజాలానికి కేరాఫ్ అడ్రస్ రోజా అంటూ విరుచుకుపడ్డారు. మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే రోజా అని ఆరోపణలు చేశారు.

Vangalapudi Anitha slams Mahanati Roja crying drama!!

టీడీపీ నేతలు ఏదో అన్నారని రోజా కంట తడిపెట్టారు. మరి మగవాళ్ల గురించి రోజా నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చా? అంటూ ప్రశ్నించారు. దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా నా గురించి రోజా అసభ్యంగా మాట్లాడారు. పీతల సుజాత గారిని బాడీ షేమింగ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు రోజా తాను ఆడదాన్ని అన్న విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.

అప్పుడు మాట్లాడింది రోజా కాదా అంటూ ప్రశ్నించిన వంగలపూడి అనిత ఆరోజు ఆడతనం, మహిళ అన్న అంశాలు రోజాకు గుర్తుకు రాలేదా? ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? అంటూ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవా? మా ఫిర్యాదులపై ఇప్పటివరకు విచారణ జరగలేదు అని పేర్కొన్నారు.

రోజా మాట్లాడిన పాత వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వంగలపూడి అనిత టిడిపి నేతల పైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్వీట్ చేశారు. అసెంబ్లీలో భువనేశ్వరి గారిని గురించి వెకిలిగా మాట్లాడినప్పుడు రోజా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

గతంలో మద్యం బాటిళ్లను పగలగొట్టిన రోజా, రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అని పేర్కొన్న వంగలపూడి అనిత అలాంటి చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే రోజా సంబరాలు చేసుకున్నారని అన్నారు. మంత్రి రోజా ఎంత అసభ్యంగా మాట్లాడుతారో అందరికీ తెలుసని అన్నారు వంగలపూడి అనిత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+