వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి విడదల రజినీని టార్గెట్ చేసిన వంగలపూడి అనిత.. బాలకృష్ణపై రజిని వ్యాఖ్యలకు కౌంటర్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడం పై మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై మండిపడిన బాలకృష్ణ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇక బాలయ్య వ్యాఖ్యలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కౌంటర్ వేశారు. దీంతో విడదల రజినిని టార్గెట్ చేశారు టిడిపి నాయకురాలు వంగలపూడి అనిత.

వైఎస్సార్ వదిలిన బాణాన్ని; మాటలతో చీల్చి చెండాడుతున్న వైఎస్ షర్మిల!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సిగ్గు లేని బ్రతుకులు అంటూ బాలకృష్ణ ఆగ్రహం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సిగ్గు లేని బ్రతుకులు అంటూ బాలకృష్ణ ఆగ్రహం


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిప్పులు చెరిగారు. సిగ్గులేని బతుకులు అంటూ మండిపడ్డారు . మార్చడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదని, ఓ సంస్కృతి, నాగరికత తెలుగుజాతి వెన్నుముక అని పేర్కొన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు పేరు మార్చాలని కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని, మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. శునకాల ముందు తలవంచకు తిరిగే సిగ్గులేని బతుకులు అంటూ ఘాటుగా స్పందించారు.

బాలయ్య వ్యాఖ్యలకు విడదల రజిని సెటైర్లు

బాలయ్య వ్యాఖ్యలకు విడదల రజిని సెటైర్లు


ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి విడదల రజిని సెటైర్లు వేశారు. బాలయ్య పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. బాలకృష్ణ ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన? అంటూ ప్రశ్నించిన మంత్రి విడదల రజిని 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి, హెల్త్ యూనివర్సిటీ కి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు బాలకృష్ణ.. గవర్నమెంట్ హాస్పిటల్స్ ను పిల్లల్ని ఎలుకలు కొరికి హాస్పిటల్స్, సెల్ ఫోన్ లైట్ లో ఆపరేషన్ చేసే హాస్పిటల్స్ గా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్... అయినా సరే మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటుంది.. ఇది కరెక్టేనా? అంటూ తనదైన శైలిలో బాలకృష్ణ ను టార్గెట్ చేశారు.

మంత్రి విడదల రజినీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన వంగలపూడి అనిత..

మంత్రి విడదల రజినీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన వంగలపూడి అనిత..


బాలకృష్ణపై మంత్రి విడదల రజనీ చేసిన వ్యాఖ్యలపై టిడిపి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు రివర్స్ ఎటాక్ చేశారు. రజినీ... ప్రజల హెల్త్‌ అంటే మీకు ఎంత చులకన?!. 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్‌ యూనివర్సిటీకి మాత్రం వైఎస్సార్‌ పేరు పెట్టాలని నాటకాలు వేస్తారా.? అంటూ మంత్రి విడదల రజిని ని టార్గెట్ చేశారు. రజినీ... గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ను సెల్‌ఫోన్‌ లైట్లలో ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్‌గా మార్చిన మీ నీలి గ్యాంగ్‌... అయినా మెడికల్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరే ఉండాలనుకుంటోంది!. ఇది కరెక్టేనా.? అంటూ మంత్రి రజిని అడిగిన ప్రశ్నలనే తిరిగి విడదల రజినిని ప్రశ్నించారు వంగలపూడి అనిత.

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చటం అనైతికం అన్న అనిత

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చటం అనైతికం అన్న అనిత


ఇక అంతకుముందు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం పై నిప్పులు చెరిగిన వంగలపూడి అనిత దోచుకున్న సొమ్ము, దోచుకున్న భూమిలో కొంత సమాజానికి వెనక్కి ఇచ్చి అందులో ఒక ఆసుపత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తూ ఆ ఆసుపత్రికి పెట్టుకోవచ్చుగా వైయస్సార్ పేరు అంటూ ప్రశ్నించారు. మీకు చేతనైతే కొత్తగా మీరు నిర్మించిన దానికి వైయస్సార్ పేరు పెడితే వద్దనేది ఎవరు? అంటూ ప్రశ్నించిన వంగలపూడి అనిత ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చటం అనైతికం, అసంబద్ధం అంటూ నిప్పులు చెరిగారు. పేరు నిలబెట్టడం అంటే కనబడిన ప్రతి బోర్డుకి మీ పేరు రాసి గుంజ పాతి నిలబెట్టడం కాదని మీ పుత్ర రత్నానికి అర్ధరాత్రి మంతనాలలో మీరైనా చెప్పండి వైయస్సార్ గారు అంటూ సెటైర్లు వేశారు.

English summary
Vangalapudi Anitha targeted Rajini's comments on Balakrishna. Minister Rajini was Angered by Balakrishna's response regarding NTR University's name change. Vangalapudi Anitha asked Rajini the same questions in reverse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X