విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరుపై అభ్యంతరాలు-రంగా పేరు పెట్టాలని వంగవీటి డిమాండ్
ఏపీలో కొత్త జిల్లాలు, వాటి పేర్ల వ్యవహారంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని పరిధిలో ఉన్న విజయవాడను జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కూడా నిర్ణయించారు. ఇదే ఇప్పుడు అభ్యంతరాలకు కారణమవుతోంది.
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏర్పడే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరానికి చెందిన వంగవీటి కుటుంబం నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ పేరుకు బదులుగా అందరికీ ఆమోదయోగ్యుడైన దివంగత నేత వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన కుటుంబ సభ్యుడు, రాధా-రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన బీజేపీ నేత వంగవీటి నరేంద్ర ఇవాళ డిమాండ్ చేశారు.

Recommended Video
కొత్తగా ప్రతిపాదించిన జిల్లాలలో క్రష్ణాజిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వంగవీటి నరేంద్ర ఇవాళ ప్రకటించారు. క్రష్ణాజిల్లాకు, ప్రజలకోసం ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు, ప్రజానేత స్వర్గియ వంగవీటి మోహన రంగా గారి పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో విజయవాడతో కూడిన కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని గతంలోనే తాము ప్రభుత్వాన్ని కూడా కోరినట్లు నరేంద్ర తెలిపారు. అయినా ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి ఎన్టీఆర్ పేరు ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం కావాలనుకుంటే కృష్ణాజిల్లాలో నుంచి ఏర్పడుతున్న మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications