జ‌గ‌న్ జాగ్ర‌త్త‌గా ఉండూ : లోట‌స్ పాండ్ పారిపోవాలి : వ‌ంగ‌వీటి రాధా హెచ్చ‌రిక‌..!

Recommended Video

    AP Assembly Election 2019 : లోట‌స్ పాండ్ పారిపోవాలి.. జగన్‌కు వ‌ంగ‌వీటి రాధా హెచ్చ‌రిక‌..!

    వైసిపికి రాజీనామా చేసి టిడిపి లో చేరిన వంగ‌వీటి రాధాకృష్ణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు జ‌గ‌న్ కు వ‌ణుకు పుట్టించాల‌ని రాధా పిలుపునిచ్చారు. మ‌న శ‌క్తి ఏంటో జ‌గ‌న్ ను చూపించాల‌న్నారు. కృష్ణా జిల్లాలో టిడిపి అభ్య‌ర్దుల‌కు మ‌ద్ద‌తుగా రాధా ప్ర‌చారం నిర్వ‌హించారు.

    లోట‌స్ పాండ్ కు పారిపోవాలి..

    లోట‌స్ పాండ్ కు పారిపోవాలి..

    రానున్న ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో జగన్‌కు వణుకు పుట్టాలని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో మనమేంటో జగన్‌కు చూపించాలన్నారు. మనమిచ్చే తీర్పుతో జగన్‌కు ఒణుకు పుట్టి, హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌కు పారిపోవాలన్నారు. జగన్‌ జాగ్రత్తగా ఉండూ, ఎన్నికల్లో ప్రజాతీర్పు ద్వారా నిన్ను తరిమి తరిమి కొట్టడం ఖాయం.. అని రాధాకృష్ణ హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఓట్లు వేశారా లేదా అని చూసి మాట్లాడే వలస నాయకుడు జోగికి ఈ సారి బుద్ధి చెప్పాలని.. ఈ ఓటమితో చిరస్థాయిగా పారిపోవాలని.. గెలుపు కోసం సుదూరం నుంచి వచ్చిన మరో వలస నాయకుడు బాలశౌరిని తిప్పి పంపాలన్నారు. టిడిపి అభ్య‌ర్దుల‌ను గెలిపించాల‌ని కోరారు.

    కాపు ప్రభావిత ప్రాంతాల్లో ప్ర‌చారం..

    కాపు ప్రభావిత ప్రాంతాల్లో ప్ర‌చారం..

    వంగ‌వీటి రాధా వైసిపిని వీడే స‌మ‌యంలో జ‌గ‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఆయ‌న టిడిపి లో చేర‌టానికి నిర్ణ‌యించే ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వైసిపి నేత‌లు విమ‌ర్శించారు. అయితే, ఆయ‌న చాలా రోజులు టిడిపి లో చేర‌కుం డా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు. ఎట్ట‌కేల‌కు మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ధ్య వ‌ర్తిత్వంతో ఆయ‌న టిడిపి లో చేరారు. రాధా టిడిపి లో చేరిక స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎంపీగ పోటీ చేసే అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. చేరిక స‌మ యంలో జ‌రిగిన స‌భ‌లోనూ ముఖ్య‌మంత్రి స్వ‌యంగా హామీ ఇచ్చారు. రాధాకు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తాన‌ని ప్ర‌క‌టించా రు. కానీ, రాధాకు ఎన్నిక‌ల్లో సీటు కేటాయించ లేదు. ఇప్పుడు కృష్ణా..ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని కాపు ప్రభావిత నియో జ‌క‌వ‌ర్గాల్లో టిడిపి అభ్య‌ర్దుల త‌ర‌పున ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

    ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

    జ‌గ‌న్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు..

    జ‌గ‌న్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు..

    వంగ‌వీటి రాధా త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధానంగా వైసిపి అధినేత జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ప్ర‌తీ స‌భ‌లోనూ జ‌గ‌న్ పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టిడిపిని గెలిపించాల‌ని..జ‌గ‌న్ ను హైద‌రాబాద్ కే ప‌రిమితం చేయాల‌ని సూచిస్తున్నారు. అయితే, రాధా ప్ర‌చారం ఎన్నిక‌ల్లో ఎంత మేర ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది.
    ప‌వ‌న్ క‌ళ్యాన్ విజ‌య‌వాడ న‌గ‌రంలో ప్ర‌చార స‌భ ఏర్పాటు చేసిన స‌మ‌యంలో భారీ స్పంద‌న క‌నిపించింది. ఆయ‌న‌
    సైతం ఆ స‌భ‌లో ప్ర‌ధానంగా జ‌గ‌న్ పైనే విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ల‌క్ష్యంగా వంగ‌వీటి రాధా విమ‌ర్శ‌లు చేస్తూ..టిడిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. వంగ‌వీటి రాధాకు ఎమ్మెల్సీ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా..గ‌త నెల‌లో భ‌ర్తీ చేసిన స్థానాల్లో రాధాకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా రాధా రాజ‌కీయ భ‌విత వ్యం ఖ‌రారు కానుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+