చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Festival: వరలక్ష్మి వ్రతం, తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో మొదలైన వేడుకలు, ఆన్ లైన్ లో !

|
Google Oneindia TeluguNews

తిరుపతి/తిరుచానూరు: హిందువులు, మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీ వరమహాలక్ష్మి వ్రతం పండుగ (వరలక్ష్మి వ్రతం) జరుపుకోవడానికి అన్ని దేవాలయాలు అందంగా అలంకరించుకుంటున్నాయి. కోవిడ్ నియమాలు పాటిస్తూ శ్రీ వరమహాలక్ష్మి పండుగ జరుపుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు మహిళలకు మనవి చేశాయి. ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజలతో పాటు వారివారి స్థోమతను బట్టి చీరలు, జాకెట్లు, వెండి వస్తువులు, టెంకాయలు ఇచ్చి సాటి ముత్తైదువల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటా. వరమహాలక్ష్మి వత్రం పండుగను హిందూ మహిళలు భక్తిశ్రద్ధలతో ఎంతో నిష్టగా జరుపుకుంటారు. తమ పసుపుకుంకమలు చిరుకాలం ఉండాలని, అమ్మవారు మమ్మల్ని, మాకుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని వరమహాలక్ష్మి వ్రతం జరుపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు కర్ణాటకలో ఎక్కువగా వరమహాలక్ష్మి వ్రతం ఎక్కువగా జరుపుకుంటారు. కర్ణాటకలో అయితే వరమహాలక్ష్మి వత్రం పండుగను దాదాపుగా అన్ని ఇళ్లలో జరుపుకుంటారు.

Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో తరిగొండ వెంగమాంబ 204 వర్దంతి ఉత్సవాలు, తిరుమలలో గరుడ పంచమి !Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో తరిగొండ వెంగమాంబ 204 వర్దంతి ఉత్సవాలు, తిరుమలలో గరుడ పంచమి !

తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం

తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగస్టు 20 వతేదీన వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా చేసేందుకు సిద్ధం చేసిన పూజాసామగ్రికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఎంతో వైభవంగా వరలక్ష్మి వ్రతం పండుగ నిర్వహిస్తారు. అయితే కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం వర్సువల్ విధానంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు చూడటానికి భక్తులకు అవకాశం వచ్చింది.

ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి

ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి

శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముందుగా ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌తో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా ఊరేగింపుగా తీసుకెళ్లారు. త‌రువాత అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షింత‌లు, కంక‌ణాలు, కలకండ ఉంచి అమ్మవారికి ప్రత్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఈ పూజాసామ‌గ్రిని గృహ‌స్తుల‌కు బ‌ట్వాడా చేసేందుకు పోస్ట‌ల్ అధికారుల‌కు అంద‌జేశారు.

అమ్మవారికి గాజుల విరాళం

అమ్మవారికి గాజుల విరాళం

ప‌విత్ర శ్రావ‌ణ మాసం సంద‌ర్భంగా తిరుచానూరుకు చెందిన శ్రీ ష‌ణ్ముగం వెయ్యి డ‌జ‌న్లు, తిరుపతికి చెందిన శ్రీ ఏడుకొండలు 1,500 డజన్ల గాజులను శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుకగా అందించారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు ప్ర‌సాదంగా ఈగాజులు అందించాల‌ని ఆల‌య అధికారుల‌ను దాత‌లు మనవి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరిబాయి, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఏఈవో ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శేషగిరి, అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Recommended Video

Spl Report On Sharmila Party Flag Hoisting || Oneindia Telugu
 కోవిడ్ నియమాలు పాటించాలని మనవి

కోవిడ్ నియమాలు పాటించాలని మనవి


హిందువులు, మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీ వరమహాలక్ష్మి వ్రతం పండుగ (వరలక్ష్మి వ్రతం) జరుపుకోవడానికి అన్ని దేవాలయాలు అందంగా అలంకరించుకుంటున్నాయి. కోవిడ్ నియమాలు పాటిస్తూ శ్రీ వరమహాలక్ష్మి పండుగ జరుపుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు మహిళలకు మనవి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు కర్ణాటకలో ఎక్కువగా వరమహాలక్ష్మి వ్రతం ఎక్కువగా జరుపుకుంటారు. కర్ణాటకలో అయితే వరమహాలక్ష్మి వత్రం పండుగను దాదాపుగా అన్ని ఇళ్లలో జరుపుకుంటారు.

English summary
Festival: Varalakshmi Vratham festival celebration in Tiruchanoor near Tirupati in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X