జగన్ ఢిల్లీ పర్యటనపై వర్ల ఆగ్రహం, కేసీఆర్‌కి బాబు లేఖ!

Varla lashes out at YS Jagan for his Delhi tour
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య గురువారం మండిపడ్డారు. తనపై నమోదైన సీబీఐ కేసులను మాఫీ చేయించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు.

జగన్ ఢిల్లీ పర్యటన పైన విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసులను మాఫీ చేయించండన్న అభ్యర్థనతోనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జగన్ భేటీ అయ్యారన్నారు. అదే సమయంలో ఈడీ దర్యాప్తు వేగాన్ని కూడా నియంత్రించాలని జగన్ కోరే అవకాశాలున్నాయన్నారు.

2004లో సాధారణ వ్యక్తిగా ఉన్న వైయస్ జగన్.. 2009 నాటికి లక్షల కోట్లు ఎలా సంపాదించారని ఎద్దేవా చేశారు. ఆయన అంత మొత్తం ఎలా సంపాదించారనే విషయమై రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం సవివరంగా తెలుపుతుందని ఆయన అన్నారు. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా జగన్ తీరు ఉందన్నారు.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గురువారం మధ్యాహ్నం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాగే ఎయిడెడ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచే యోచన చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+