'జైట్లీ జీ! జగన్ ఆస్తులపై దృష్టి పెట్టండి, సాయిరెడ్డితో ప్రత్యేక కోడ్ భాషలో..'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన సిబిఐ కూడా దర్యాఫ్తు చేయలేకపోయిందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య సోమవారం నాడు ఎద్దేవా చేశారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన సిబిఐ కూడా దర్యాఫ్తు చేయలేకపోయిందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య సోమవారం నాడు ఎద్దేవా చేశారు.
ఇతర దేశాల్లో జగన్ పెట్టుబడుల పైన ఎందుకు దర్యాఫ్తు చేయలేదని సీబీఐని ప్రశ్నించారు. జగన్ పైన దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్‌ను కోరుతున్నట్లు వర్ల తెలిపారు.

జగన్ అక్రమాస్తుల పైన సోదాలు నిర్వహించేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. జగన్, విజయసాయి రెడ్డి ప్రత్యేక కోడ్ భాష వాడుతున్నారని, టన్ అంటే లక్ష, వంద టన్నులు అంటే కోటి రూపాయలు అని కోడ్ పెట్టుకున్నారన్నారు.
కాగా, దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అక్కడి స్టాడ్లర్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైలు బోగీల తయారీ కర్మాగారం సందర్శించాలని సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరగా, అందుకు ఆయన అంగీకరించారు.
భారత్ అవసరాలకు తగిన స్పీడ్ రైళ్లు అందిస్తామని 2.2 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన స్టాడ్లర్ సంస్థ తెలిపింది. పోలండ్, జర్మనీ, హంగేరి, స్విట్జర్లాండ్, బెలారస్, స్పెయిన్‌లో స్టాడ్లర్‌కు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.
ప్రస్తుతం అమెరికా, భారత్‌లో సంస్థ విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. కోచ్‌లు, ఇంజిన్లు, స్పీడ్ రైళ్ల తయారీలో స్టాడ్లర్ సంస్థకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని విశాఖలో యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా విశాఖ యూనిట్‌లో అల్యూమినియంతో విడిభాగాల తయారీకి కూడా ప్రణాళిక రూపొందిస్తోంది.












Click it and Unblock the Notifications