‘ఏయ్ ఖాకీ పో వెనక్కి.. రేయ్ వేదిక దిగు’: పోలీసులు, కార్యకర్తలపై వర్ల

మాజీ పోలీసు అధికారి అయిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య.. ఆ పార్టీ కార్యకర్తలు, పోలీసుల పట్ల చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి.

తిరుపతి: మాజీ పోలీసు అధికారి అయిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య.. ఆ పార్టీ కార్యకర్తలు, పోలీసుల పట్ల చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి. తిరుపతి ఇందిరా మైదానంలో బుధవారం తుడా ఛైర్మన్‌గా నరసింహయాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామయ్య.. 'ఏయ్ ఖాకీ.. పో వెనక్కి, సభా వేదికపై నీకేం పని' అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, సభా వేదికలో కనిపించేందుకు పార్టీ కేడర్ పోటీపడటంతో కార్యకర్తల్లో క్రమశిక్షణ లేదంటూ మైక్ తీసుకుని సీరియస్ అయ్యారు.

varla ramaiah fires at Police and TDP workers

'ఏయ్.. రేయ్.. వేదిక దిగు.. నీకేంపనిక్కడ వెళ్లు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వర్ల రామయ్య వ్యాఖ్యలతో పలువురు నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. ఓ సీనియర్ నేత కార్యకర్తల పట్ల ఇలా మాట్లాడటం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+