అరాచక శక్తుల అడ్డా: జగన్ పార్టీపై వర్ల, ఈడ్చుకెళ్లారని..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అడ్డా అని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీ గూండాల పార్టీ అని, అరాచక శక్తుల పార్టీ, అవినీతిపరుల పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు.
అటువంటి పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ సమయాన్ని వృధా చేయడం తగదని అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు అనంతపురంలో ఇద్దరు సభ్యులను ఈడ్చుకెళ్లారని తెలిపారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొంత మంది తెలుగుదేశం పార్టీ వైపు వస్తుంటే వద్దని ఎలా చెప్పమంటారని ప్రశ్నించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధుల ప్రమాద ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, అలాగే గ్యాస్ ప్రమాదంలో కూడా మరణించిన వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయిలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇప్పించిన ఘనత తమ నేతకే దక్కుతుందని వర్ల రామయ్య అన్నారు.
ఇది ఇలా ఉండగా డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, మిగిలిన ప్రపంచానికి ప్రచార వారధిగా పనిచేస్తానని అన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సలహాదారుగా బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు. కేంద్రానికి, ఇతర దేశాలకు సైతం సమాచార వారధిగా ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications