వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గు, లజ్జ ఉంటే ఉరేసుకునేవాడు: జగన్‌పై వర్ల వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Varla Ramaiah
హైదరాబాద్‌: ప్రజా ధనాన్ని లక్షల కోట్లలో లూటీ చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌లాంటి కొడుకు ఉండాలని ఏ తల్లితండ్రి కోరుకోరని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించటం సాధ్యమా అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. జగన్‌ దోపిడీని చూసి, ఇంత పెద్ద నేరస్తుడిని ఇంతవరకు చూడలేదని సిబిఐ డైరెక్టర్‌ అన్నాడని రామయ్య గుర్తు అన్నారు.

తన కొడుకు జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విజయమ్మ ప్రజలకు పిలుపు నివ్వగలదా అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. జగన్‌కు ఇంకా శిక్ష పడలేదుగా అని అంబటి లాంటి వాళ్ళు అంటున్నారని, జగన్‌ ఇప్పటికి 16 నెలులగా జైల్లో ఉన్నాడు, ఇంకా 16 సంవత్సరాలు జైల్లో ఉన్నా జగన్‌ చేసిన పాపం పోదని ఆయన అన్నారు. ఆర్థిక నేరాల మీద ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించబట్టే ఇప్పటివరకు జగన్‌కు శిక్ష పడలేదని, దేశం ముందుకు పోవటల్లేదని రామయ్య ఆరోపించారు.

సిగ్గు లజ్జ ఉంటే ఈ పాటికి ఎప్పుడో జగన్‌ ఉరేసుకుని ఉండేవాడని ఆయన వ్యాఖ్యానించారు. 2004వ సంవత్సరంలో తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, సొంత ఇల్లుకూడా లేదని, ఎన్టీర్‌ భవన్‌ వెనక ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్‌ ఇవ్వగలని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడని రామయ్య తెలిపారు. అలాంటిది ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులను ఏలా సంపాదించారో జగన్‌ ప్రజలకు తెలియ చేయాలని రామయ్య డిమాండ్‌ చేశారు.

భవనాలు, భూములు, పరిశ్రమలు, పత్రిక, టివి ఛానల్‌ జగన్ ఏవిధంగా సంపాదించాడో తెలపాలని, పత్రికలన్నీ నష్టాల్లో నడుస్తూ, గతంలో ఉన్న కలర్‌ను కూడా తీసేసి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో పత్రికలను ప్రచురిస్తున్నారని, మరి జగన్‌ పత్రిక సాక్షికి ఇంత లాభాలు ఏలా వస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు కోట్ల రూపాయల ఆస్థులను సీజ్‌ చేసిన ఈడి, ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన విమర్శించారు ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకొని ప్రజలకోసం ఆసుపత్రి కట్టించాడని, అదేవిధంగా స్పషల్‌ యాక్ట్‌ పెట్టి జగన్‌ అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకొని, ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లోని జగన్‌ బంగ్లాలో బాలికల ఆశ్రమ పాఠశాలగా చేయాలని, బెంగుళూరులో ఉన్న భవనాన్ని వయో వృద్దులకు ఆశ్రమం కల్పించాలని, భారతీ సిమెంట్‌ పరిశ్రమను, దానికి కేటాయించిన భూములను స్వాదీనం చేసుకొని, ఇందిరమ్మ పేరుమీద పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మించుకోవటానికి ఉచితంగా సిమెంట్‌ ఇవ్వాలని కోరారు.సాక్షి పత్రికను స్వాదీనం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పుస్తకాలు ముద్రించాలని రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

English summary

 Telugudesam party leader Varla Ramaiah made wild comments against YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X