"లిక్కర్ ఏజెంట్‌లా చంద్రబాబు.. బీచ్ ఫెస్టివల్ లాగా బీర్ ఫెస్టివల్"

హైదరాబాద్ : ఏపీలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో470ను తప్పుబడుతోంది ప్రతిపక్షం వైసీపీ. నిన్నటిదాకా బీచ్ ఫెస్టివల్, లవ్ ఫెస్టివల్ అన్న ప్రభుత్వం ఇప్పుడు బీర్ ఫెస్టివల్ అంటోందని ఎద్దేవా చేశారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఏపీలో విచ్చలవిడి మద్యం అమ్మకాల కోసం జారీ చేసిన జీవో470ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం నాడు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు లిక్కర్ ఏంజెట్ లా మారారని దుయ్యబట్టిన పద్మ.. రెండున్నర కోట్ల ఏపీ ఆడపడుచులను ఆయన కన్నీళ్లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మద్యం మత్తులో జోగేలా చేసి.. అందినకాడికి దోచుకునేందుకు కుట్ర పన్నుతారని ఆరోపించారు.

vasireddy padma demanded govt to cancel go470

తాగండి.. తాగి ఊగండి అన్న చందాన ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. రాష్ట్రంలో నేరాల రేటు పెరగడానికి మద్యం అమ్మకాలే కారణమన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా సరే.. ఖజానా పెట్టె నిండాలన్న యోచనలో సర్కార్ ఉందని ఆరోపించారు పద్మ.

సీఎం చంద్రబాబు బీరు-బాబు అంటూ బహిరంగ నినాదాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో సుప్రీం ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులకు 100మీటర్ల లోపు మద్యం అమ్మకాలు జరపకూడదన్న సుప్రీం ఆదేశాలను పట్టించుకోకుండా.. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేస్తోందని మండిపడ్డారు. మహిళల కన్నీళ్ల మీద నారా వారి సామ్రాజ్యాన్ని కట్టి, అందులో లోకేష్ ను కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+