గద్దల్లా, బాబు నోటి నుంచి ఆ మాటే రాలేదు, చైనా మన శత్రువు: వాసిరెడ్డి

హైదరాబాద్: 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ దుమ్మెత్తి పోశారు. ఆయన తన ప్రసంగంలో ఎక్కడా ఏపీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడలేదన్నారు.

చంద్రబాబు రెండు గంటలు చేసిన ప్రసంగంలో మనసుకు సంబంధించిన మాటలు ఏమీ మాట్లాడలేదన్నారు. ఈ దేశ స్వాతంత్ర్యం గొప్పతనం గురించి, సొంత కాళ్ల మీద ఈ రాష్ట్రం ఎలా ఎదగాలనే విషయం ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు రెండు గంటలు మాట్లాడినా.. ఎక్కడా ఈ రాష్ట్రాన్ని సొంత కాళ్లపై నిలబడతానని చంద్రబాబు చెప్పలేదన్నారు.

ఈ రాష్ట్రం తన కాళ్ల మీద నిలబడుతుందనే నమ్మకం చంద్రబాబు ఇవ్వలేకపోయారన్నారు. చంద్రబాబు స్వతంత్ర్యం అనే దానిని వదిలేసుకున్నారని ఎద్దేవా చేశారు. మన రాజధాని అమరావతిని తీసుకెళ్లి సింగపూర్ చేతిలో, సముద్ర తీరాన్ని చైనా చైతిలో, జపాన్ చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. మన వాళ్ల పైన చంద్రబాబుకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు.

Vasireddy Padma lashes out at Chandrababu for Independence Day speech

కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకోలేదన్నారు. సమరయోధులను స్మరించకపోవడం సరికాదన్నారు. ఓ మంచి సందేశాన్ని ఇవ్వలేకపోయిన చంద్రబాబు... ముఖ్యమంత్రి స్థాయిలో ఉండటం దురదృష్టకరమన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

ఖద్దరు తయారు చేసే చేనేత కార్మికుల గురించి మాట్లాడకుంటే ఎలా అన్నారు. వారికి రుణమాఫీ చేస్తానని చెప్పలేదన్నారు. కొత్తగా ఏర్పడిన ఏపీని సొంత కాళ్ల పైన నిలబెడతామని ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. రెండు గంటల ప్రసంగంలో ఎక్కడా స్వతంత్ర్యం అనే మాట చంద్రబాబు నోటి నుంచి రాలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన భరోసా ఇవ్వలేకపోయారన్నారు.

ఫ్రెంచి కంపెనీల పైన, బ్రిటిష్ కంపెనీల పైన నాడు తొలుత ఏ రాజులు పోరాడలేదన్నారు. అందుకే మనం స్వాతంత్ర్యం కోల్పోయామన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నారన్నారు.

చైనా మనకు ఓ బలమైన శత్రు దేశమని, అలాంటి దేశాన్ని తీసుకు వచ్చి సముద్ర తీరాన్ని అప్పగిస్తున్నారన్నారు. ఇలాంటప్పుడు మనం స్వతంత్ర్యం గురింంచి ఎలా మాట్లాడుతామన్నారు. రాజధానికి ఇచ్చిన రైతులు, వ్యవసాయం చేసే రైతులు ఎక్కడా నష్టపోకుండా మనం చూడాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం సర్వం దోచి పెడుతున్నారన్నారు.

విదేశీ కంపెనీలు గద్దాల వలె, రాబందుల వలె తన్నుకుపోయేందుకు చూస్తున్నాయన్నారు. ఏపీ ఇప్పుడు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. ఏపీ ఎంత ప్రమాదకర పరిస్థితులో ఉందో చెప్పడానికి చంద్రబాబు నేడు చేసిన ప్రసంగం నిదర్శనం అన్నారు. చంద్రబాబు ప్రసంగం అత్యంత దౌర్భాగ్యం అన్నారు. కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని చంద్రబాబు అడగటం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+