"ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం"
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని తప్పుబడుతూ.. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు నాయుడి చేతకాని తనం, అసమర్థత వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దివంగత మహానేత వైఎస్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని పద్మ మండిపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. సీఎం చంద్రబాబు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే జర్నలిస్టులపై సైతం చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

సాగునీటి విషయంలో రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఏపీఐడీఈ చట్టంలో ఇంత హడావుడిగా సవరణలు చేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పద్మ.. హైకోర్టులో స్విస్ చాలెంజ్ పై విచారణ జరుగుతోన్న సమయంలోనే ఈ సవరణలు చేయడాన్ని తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications