పవన్ తిక్కకు లెక్కలేదు: వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు

వైయస్ కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తికి.. ఆయనపై విమర్శలు చేసే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు.
వైయస్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలన్నీ కారుకూతలని, పిచ్చి మాటలని దుయ్యబట్టారు. వైయస్ పాలన గురించి తెలుసుకునే మనసు పవన్ కళ్యాణ్‌కు లేదని ఆరోపించారు. వైయస్‌ను తలచుకునే పేదలను చూసే కళ్లు కూడా పవన్‌కు లేవని విమర్శించారు.
తొలి సిఎం జగనే: వైవి సుబ్బారెడ్డి
ప్రకాశం:ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాటం చేసిన ఏకైక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
జైలులో ఉండి కూడా సమైక్య రాష్ట్రం కోసం జగన్ దీక్ష చేశారని ఆయన తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయితే మహిళలు, యువతకు పెద్దపీట వేస్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications