రోహిత్ సూసైడ్: జెపి సంఘీభావం, చంద్రబాబు-కెసిఆర్‌ల మౌనంపై ప్రశ్నలు
గుంటూరు: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల దీక్షకు లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు.
వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు స్పందించక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య పైన తెరాస నుంచి ఎంపీ కవిత తదితరులు స్పందించారు.

టిడిపి నుంచి కూడా పలువురు నేతలు ఆచితూచి స్పందించారు. రోహిత్ ఆత్మహత్య పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిఎస్పీ అధినేత్ర మాయావతి, బిజెపి నేతలు ఇలా దాదాపు అందరూ స్పందించారు. కానీ ఇప్పటి వరకు కెసిఆర్, చంద్రబాబులు స్పందించలేదు. దీనిని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గురువారం నాడు సిపిఐ నేత డి రాజా మాట్లాడుతూ... తెలంగాణ సిఎం కెసిఆర్ ఈ ఘటన పైన ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏపీలోని విపక్ష నేతలు చంద్రబాబు స్పందించక పోవడాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications