హోదా కోసం అధిష్టానం వద్ద వెంకయ్య పోట్లాట! మాగంటి శపథం
విజయవాడ/న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు బీజేపీ పెద్దలతో పోట్లాడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బుధవారం నాడు వెంకయ్య హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు.
బీజేపీలో, కేంద్రంలో వెంకయ్య అంతర్గతంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు. అయితే, ఈ విషయాలను తాము బయటకు చెప్పలేమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం విభజనకు ముందు పోరాడిన వెంకయ్య ఇప్పుడు ఎందుకు వద్దంటారని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.

బాబు మాటే..: హోదాపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
ప్రత్యేక హోదా కింద ఎన్ని కోట్లు వస్తాయో.. అన్ని కోట్లు ప్యాకేజీగా ఇస్తామంటే తాము దానికి అంగీకరిస్తామని టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తద్వారా ప్యాకేజీకి తాము సిద్ధమన్నారు. విభజనకు వైసిపి అధినేత జగన్ దారి చూపాడన్నారు.
జగన్ ఢిల్లీలో దుష్ప్రచారం చేస్తున్నాడని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. కాగా, టిడిపి ఎంపీలతో గత వారం జైట్లీ, వెంకయ్య సమావేశమైన సందర్భంగా కేంద్రమంత్రులు ఇద్దరి మధ్య హోదాపై వాదన జరిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
వెంకయ్య ఎదుట మాగంటి శపథం
టిడిపి సీనియర్ నేత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు పెంచిన గడ్డం చర్చకు తెర తీసింది. మాగంటి ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లా గడ్డం పెంచడంతో.. ఆయనను ఢిల్లీలో 'ఆంధ్రా అమిత్ షా' అంటున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మాగంటి బాబును బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఓ ప్రశ్న వేశారు. గడ్డం ఎప్పుడు తీస్తావని అడిగారు. దానికి మాగంటి బాబు.. మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదాకా గడ్డం తీ సేది లేదని చెప్పారట. దీంతో వెంకయ్య మిన్నకుండిపోయారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications