వెంకయ్య ఆదేశాలు: ఏపీలోని 31 'అమృత్' పట్టణాలకు 673 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: ఫిక్కీ ఆధ్వర్యంలో ఢిల్లీలో స్మార్ట్ సిటీస్‌పై గురువారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారత్‌లో స్మార్ట్ సిటీల మిషన్ సాధారణ విషయం కాదన్నారు.
దేశ వ్యాప్తంగా నిర్మించనున్న స్మార్ట్ సిటీల నిర్మాణానికి కన్స్‌ల్టెన్సీ సంస్ధలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయన్నారు. స్మార్ట్ సిటీలపై ప్రజల ఆలోచనా తీరు మారాలని వెంకయ్య అన్నారు. ఇక కేంద్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమృత్ పథకం కింద పట్టణాలకు అభివృద్ధి చేయనున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో 31 అమృత్ పట్టణాలకు నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అధికారులను ఆదేశించారు. అమృత్ పట్టణాలకు నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఐదేళ్లకు రూ. 28,756 కోట్లు కేటాయించాలని తెలిపింది.
2015-16 సంవత్సరానికి గాను రూ.673 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంగీకరించింది. ఏపీ కోరినట్టుగా రూ.673 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications