వారిద్దరే మార్గదర్శకులు, తల్లికి దూరమయ్యా అంటూ కంటతడి పెట్టిన వెంకయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: చిన్నతనంలోనే పార్టీని వీడిన తనకు బిజెపి ఎంతో ఇచ్చిందని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే పార్టీకి దూరం కావడంతో ఆయన బావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే కన్నీరు పెట్టుకొన్నారు.

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా నెల్లూరు వీఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు.

venkaiah naidu

సామాన్య కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదిగానని ఆయన చెప్పారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తనకు బిజెపి తల్లిగా మారి అనేక పదవులను ఇచ్చిందని ఆయన గుర్తుచేసుకొన్నారు. అలాంటి పార్టీని వీడడం బాధగా ఉందని ఆయన సభా వేదికపైనే బావోద్వేగానికి గురయ్యారు. కంటతడిపెట్టారు.

తన జీవితంలో దుర్గాప్రసాద్, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు మార్గదర్శకులుగా ఉన్నారని వెంకయ్య గుర్తుచేసుకొన్నారు. ఆర్ఎస్ఎస్ తనకు వ్యక్తిత్వాన్ని ఇస్తే ఏబీవీపి తనకు నాయకత్వాన్ని నేర్పించిందన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం అలవర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

Venkaiah Naidu To Be First Vice President If Elected

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన సందర్భంగా వెంకయ్యనాయుడుకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి నుండి హెలిక్యాప్టర్‌లో నెల్లూరుకు వచ్చిన వెంకయ్యనాయుడుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ గ్రౌండ్స్ నుండి వీఆర్ కాలేజ్ వరకు నిర్వహించిన ర్యాలీలో పూలవర్షం కురిపిస్తూ ప్రజలు వెంకయ్యకు స్వాగతం పలికారు. 1500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After elected as a vice president Venkaiah naidu came to first time Nellore on Monday.venkaiah naidu grandly felicitated in VR college grounds.
Please Wait while comments are loading...